ర‌క్త‌హీన‌తను త‌గ్గించే సూప‌ర్ ఫుడ్ ఇదే!

రక్తహీనత లేదా ఎనీమియా.నేటి కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌పడుతున్నారు.

ఐర‌న్ లోపం, స‌రైన పోష‌కాహారం తీసుకోక‌పోవ‌డం, పులుపు మ‌రియు ఉప్పు అతిగా తీసుకోవడం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంటుంది. ర‌క్త‌హీన‌త వ‌ల్ల నీర‌సం, బ‌ల‌హీనంగా మార‌డం, త్వ‌ర‌గా అల‌సిపోవ‌డం, క‌ళ్లు తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Tips For How To Get Rid Of Anemia! Anemia, Latest News, Health Tips, Health, Hea

ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆహార ప‌దార్థాల‌ను డైట్‌లో చేర్చుకుంటే.

సులువుగా ర‌క్త హీన‌త స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ప్ర‌తి రోజు ఒక గ్లాసు బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకోవాలి.

Advertisement

బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంతో తేనె మ‌రియు అర‌టి పండు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

బాగా పండిన అర‌టి పండులో తేనె క‌లిపి రోజుకు ఒక సారి తీసుకోవాలి.ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే ఐర‌న్ పుష్క‌లంగా ఉండే ఆకుకూర‌లు అంటే పాలకూర, మెంతి కూర, తోట‌కూర వంటి వారానికి రెండు లేదా మూడు సార్లు అయినా తీసుకోవాలి.త‌ద్వారా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

బెల్లం ర‌క్త‌హీన‌తనూ దూరం చేయ‌డంతో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఎందుకంటే, బెల్లంలో ఐరన్‌, ఫోలిక్ ఆమ్లం పుష్క‌లంగా ఉంటాయి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఇవి ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చూడ‌డంతో పాటు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది.అలాగే తాజా పండ్లు, గుడ్లు, పాలు, న‌ట్స్‌, మాంసాహారం ఎక్కువగా తినాలి.

Advertisement

ఇక ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తేనె తీసుకోవాలి.తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంద‌ని అంటున్నారు.

అదేవిధంగా, నువ్వును పాల‌లో నాన‌బెట్టి.లేదా బెల్లంతో క‌లిపి ప్ర‌తి రోజు తీసుకోవాలి.

త‌ద్వారా ర‌క్త‌వృద్ధి జ‌రుగుతుంది.

తాజా వార్తలు