జింకను చూసి పులి జంకిందా? దాడి చేయకుండానే దాటి వెళ్ళిపోతోంది!

సోషల్ మీడియా ప్రభావం మనుషులపై దారుణంగా వుంది.సగటు మనిషి రోజుకి దాదాపు నాలుగైదు గంటలు సోషల్ మీడియాలోనే కాపురం చేస్తున్నాడని తాజా సర్వేలు చెబుతున్నాయి.

ఇకపోతే ప్రతిరోజూ కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతూ ఉంటాయి.ఐతే అందులో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి.

ఎందుకంటే ఆయా వీడియోలలో నచ్చే విషయం ఏదో ఒకటి వుండే ఉంటుంది.అయితే వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువశాతం జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ మెప్పించింది.సాధారణంగా పులి అన‌గానే అడ‌విలో ఇత‌ర జంతువులు భయంతో పారిపోతూ ఉంటాయి.అందుకే పులి తిరుగాడే ప్ర‌దేశాల్లో అవి తిరగడానికి కూడా భయపడుతూ ఉంటాయి.

Advertisement

ఇకపోతే, అలాంటి పులి ఎదుట ఓ జింక‌ చాలా ధైర్యంగా నిలబడి వుంది.ఇక పులి కూడా వాటికీ ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌కుండానే జింక పక్కనుండే చాలా కూల్ గా వెళ్లిపోవడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

IFS అధికారి ర‌మేష్ పాండే ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

కాగా జింకపై పులి దాడి చేయ‌కుండా త‌న దారిన తాను వెళుతుండ‌టం ఇపుడు సోషల్ వీడియోలో హాట్ టాపిక్ అవుతోంది.ఇక దీనిని షేర్ చేసిన వ్యక్తి."ఈ పులి సన్యాసి.

ఇది మీకు ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది కలిగించదు.అందుకే మీరు కూడా దానికి ఇబ్బంది కలిగించద్దు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

వీలైనంత వరకు తన ప్రశాంతతను కాపాడుకోవడానికి పులి యత్నిస్తోంది." అని క్యాప్షన్ ఇచ్చాడు.

Advertisement

ఈ వీడియోను తొలుత ఉత్త‌రాఖండ్ అట‌వీ ప‌రిశోధ‌నా కేంద్రం షేర్ చేసింది.ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఇంతవరకు 94,000కుపైగా వ్యూస్‌ను రాబ‌ట్టింది.

పులి స‌న్యాసిగా వ్య‌వ‌హ‌రించిన తీరు నెటిజ‌న్ల‌కు బాగా ఆకట్టుకుంది.

తాజా వార్తలు