టికెట్లు ఫైనల్.. గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ ?

తెలంగాణలో హ్యాట్రిక్ విజయం కొసం ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( KCR ) గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.ఎన్నికలకు సరిగ్గా ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది.

ఇప్పటికే ఎన్నికలకు అన్నీ విధాలుగా సమాయత్తం అయిన గులాబీ బాస్( gulabi boss ).అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.నియోజిక వర్గాల వారీగా ఎవరి ప్రభావం ఎంతమేర ఉంది.

ఎవరిపై ప్రజా వ్యతిరేకత ఉంది అనే దానిపై ఇప్పటికే లిస్ట్ కూడా తయారు రెడీ చేసుకున్నారట.పని తీరు బాగాలేని ఎమ్మెల్యేలకు, నేతలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ప్రజా మద్దతు లేని నేతలకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కూడా.

Advertisement

సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది అవినీతి పాల్పడుతున్నారని వారంతా తీరు మార్చుకొని.ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించిన గులాబీ బాస్.టికెట్ల కేటాయింపులో ఎలాంటి నిర్ణయాలు తీసుకొనున్నారనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్న అంశం.

ప్రస్తుతం దశాబ్ది ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహిస్తున్న కే‌సి‌ఆర్.ఇవి పూర్తి అయిన తరువాత టికెట్ల కేటాయింపుపైనే దృష్టంతా కేంద్రీకరించనున్నారు.119 అసెంబ్లీ స్థానాలు( 119 assembly locations ) ఉన్న తెలంగాణలో ఆయా నియోజిక వర్గాల వారిగా ప్రజల్లో సానుకూలత ఉన్న 70 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి.

ఆ తరువాత మిగిలిన స్థానాలలో ఇతర పార్టీల అభ్యర్థులను బట్టి వారికి పోటీనిచ్చే అబ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.అక్టోబర్ లేదా నవంబర్ లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది.ఈలోపే 70 మంది అబ్యర్థులను కన్ఫర్మ్ చేస్తే.

టికెట్ ఆశించి భంగపడ్డ వారిని కూల్ గా బుజ్జగించే అవకాశం ఉంది.అలాగే ప్రజల్లో కూడా రేస్ లో ఉన్న అభ్యర్థులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో కే‌సి‌ఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ గులాబీ బాస్ లిస్ట్ లో ఉన్న నేతలు ఎవరు ? ఎవరిపై వేటు పడనుంది ? లాంటి ప్రశ్నలకు క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Advertisement

తాజా వార్తలు