Prakasam District : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా( Prakasam )లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.బేస్తవారిపేట మండలం పూసలపాడులో కారును ఆటో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

మృతుల్లో ఇద్దరు ఆటోలోనే సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతులు అంతా బేస్తవారిపేట( Bestavaripeta ) మండలం బార్లకుంటకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement
మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు