అతి ఆకలి బాగా ఇబ్బంది పెడుతుందా.. అయితే ఇలా చెక్ పెట్టండి!

సాధారణంగా కొందరిలో ఆకలి అనేది చాలా అధికంగా ఉంటుంది.దీన్నే అతి ఆకలి( Extreme Hunger ) అంటారు.

అతి ఆకలి కారణంగా తరచూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.క్రమంగా ఇది అధిక బరువుకు( Over Weight ) దారితీస్తుంది.

మధుమేహం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందువల్ల తినడం తగ్గించాలి.

తినడం తగ్గించాలి అంటే అతి ఆకలి సమస్యకు చెక్ పెట్టాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement
This Wonderful Juice Controls Extreme Hunger Details, Extreme Hunger, Healthy J

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

This Wonderful Juice Controls Extreme Hunger Details, Extreme Hunger, Healthy J

జ్యూస్ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ బొప్పాయి పండు ముక్కలు( Papaya ) వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును( Banana ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.వీటితో పాటు అర కప్పు పీల్ తొలగించిన కీర దోసకాయ స్లైసెస్,( Cucumber ) ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు( Coconut Water ) మరియు రెండు టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన తేనె( Pure Honey ) వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

దాంతో టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెడీ అవుతుంది.

This Wonderful Juice Controls Extreme Hunger Details, Extreme Hunger, Healthy J

పపాయ బనానా కీరా జ్యూస్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.అలాగే ఈ జ్యూస్ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

అతి ఆకలి సమస్యను దూరం చేస్తుంది.ఆహార కోరికలను అణచివేస్తుంది.

Advertisement

దాంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.

అంతేకాకుండా ఈ పపాయ బనానా కీరా జ్యూస్( Papaya Banana Cucumber Juice ) బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

కంటి చూపును పెంచుతుంది.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.

బోన్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గిస్తుంది.

తాజా వార్తలు