అమర్ దీప్ కారణంగా ఆగిపోయిన ఈ వారం కెప్టెన్సీ టాస్క్..మండిపడుతున్న నెటిజెన్స్!

ఈ వారం బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో కెప్టెన్సీ టాస్క్ చాలా ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో నింపేసిన సంగతి అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ సతీమణి ని హోటల్ లో ఉన్న వాళ్ళు ఎవరో హత్య చేసారని, ఆ హత్య చేసే హంతకులు ఎవరో పట్టుకోవాల్సిందిగా పోలీసులు అయిన అమర్ దీప్ ( Amar Deep )మరియు అర్జున్ కి అప్పగిస్తాడు బిగ్ బాస్.

ఈ టాస్కు లో అమర్ దీప్ మరియు అర్జున్( Arjun ) పుట్టించిన కామెడీ ప్రేక్షకులను బాగా అలరించింది.అలాగే మధ్యలో శివాజీ మరియు అమర్ మధ్య జరిగే సంభాషణ కూడా చాలా కామెడీ గా అనిపించింది.

ఈ టాస్కు మొత్తం లో అమర్ దీప్ ని ఎక్కువగా హైలైట్ చేస్తూ చూపించారు.ఇదంతా పక్కన పెడితే శివాజీని బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ని టాస్కు నుండి డెడ్ చెయ్యాల్సిందిగా సీక్రెట్ టాస్క్ ఇస్తాడు.

This Weeks Captaincy Task Stopped Due To Amar Deep Netizens Are Angry , Bigg Bo

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కు ని అనుసరిస్తూ శివాజీ( Shivaji ) ప్రశాంత్ ని స్టోర్ రూమ్ లో దాచిపెట్టేస్తాడు.కానీ చివరికి అమర్ దీప్ కనుక్కోవడం తో శివాజీ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవుతాడు.దీంతో ఆయన్ని బిగ్ బాస్ జైలుకి పంపిస్తాడు.

Advertisement
This Week's Captaincy Task Stopped Due To Amar Deep Netizens Are Angry , Bigg Bo

అనంతరం ఇదే టాస్కు ని ప్రియాంక జైన్ కి అప్పగిస్తాడు బిగ్ బాస్.ఆ తర్వాత కూడా టాస్కుని కొనసాగించేవారు కానీ, అమర్ దీప్ కి స్వల్పం గా అస్వస్థత ఏర్పడడం తో ప్రస్తుతానికి టాస్కుని నిలిపివేశారట.

కేవలం ఒక్కరి కోసం టాస్కు ని నిలిపేశారు, ఇలాగే శివాజీ కి అస్వస్థత వచ్చినప్పుడు ఇలాగే చేసారా?, ఎందుకు అమర్ మీద బిగ్ బాస్ టీం కి అంత ప్రత్యేకమైన ప్రేమ అంటూ శివాజీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.మరోపక్క కెప్టెన్సీ టాస్కుకి ఇదే చివరి వారం అని నాగార్జున ఇది వరకే చెప్పాడు.

This Weeks Captaincy Task Stopped Due To Amar Deep Netizens Are Angry , Bigg Bo

హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు మొత్తం కెప్టెన్లు అయిపోయారు, కేవలం అమర్ దీప్, రతికా మరియు అశ్వినీ తప్ప.గత వారం కెప్టెన్సీ టాస్కులో( captaincy task ) చివరి అంకం వరకు వచ్చి ఓడిపోయినప్పుడు అమర్ దీప్ పడిన బాధని అందరూ చూసారు.ఆయన అభిమానులు కానీ వాళ్ళు కూడా అమర్ దీప్ ఏడుపు ని చూసి అయ్యో పాపం అని అనుకున్నారు.

కానీ ఈ వారం మాత్రం ఆయన కెప్టెన్సీ టాస్కు ని గెలవడం కోసం తన నుండి వంద శాతం కాదు, 200 శాతం కృషి చెయ్యాలి.అలా చేసి కెప్టెన్ అయితే మాత్రం అమర్ దీప్ గ్రాఫ్ టాప్ 1 స్థానం కి ఫిక్స్ అయిపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు