టమాటో తో హెయిర్ ఫాల్ కు చెప్పేయండి టాటా..!

ఏడాది పొడవునా ల‌భ్య‌మ‌య్యే కూరగాయల్లో టమాటో( Tomato ) ఒకటి.అలాగే దాదాపు అందరి ఇళ్లలో టమాటోను విరివిగా వాడుతుంటారు.

ఆరోగ్యపరంగా టమాటో అందించే ప్రయోజనాలు అపరిమితంగా ఉంటాయి.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు కురుల సంరక్షణకు( Hair Care ) సైతం టమాటో తోడ్పడుతుంది.

ఇప్పుడు చెప్పబోయే విధంగా టమాటోతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే హెయిర్ ఫాల్ తో అనేక జుట్టు సంబంధిత సమస్యలకు టాటా చెప్పవచ్చు.అందుకోసం ముందుగా బాగా పండిన ఒక టమాటోను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో ఒక ఎగ్ వైట్( Egg White ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ టమాటో హెయిర్ మాస్క్ ను( Tomato Hair Mask ) వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు.టమాటోలో ఉండే విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి మరియు విట‌మిన్ ఇ జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

టమాటోలో ఉండే ఆమ్లాలు స్కాల్ప్ ను శుభ్రం చేస్తాయి.ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జిడ్డుతనాన్ని తగ్గిస్తాయి.

టమాటోలో ఉండే న్యూట్రియంట్స్ జుట్టుకు సహజమైన మెరుపును జోడిస్తాయి.టమాటోలో ఉండే ఫోలేట్ మరియు ఆంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి.ఇక కోడి గుడ్డులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మరియు ఫ్యాటీ యాసిడ్లు జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

పుష్ప 2 దెబ్బకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక్క రికార్డ్ కూడా మిగలదా..?
నిద్రలో వివిధ రకాల జంతువులు కనిపిస్తున్నాయా.. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా?

జుట్టు పెరుగుదలను పోత్స‌హిస్తాయి.ఆలివ్ ఆయిల్ కూడా కురుల ఆరోగ్యానికి అండగా ఉంటుంది.

Advertisement

హెయిర్ డ్యామేజ్ ను అరిక‌డుతుంది.

తాజా వార్తలు