చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!

ఈ చలికాలంలో సీజన్ మారినందువలన గొంతు నొప్పి( Sore throat ) అలాగే ఇతర ఇన్ఫెక్షన్లు రావడం సహజం.

ముఖ్యంగా జలుబు, జ్వరం, దగ్గు, గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్, మంట, సరిగా మాట్లాడలేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

అయితే చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా బాధిస్తుంది.కాబట్టి అలాంటి గొంతు నొప్పిని పోగొట్టుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్లి ఇంగ్లీష్ మెడిసిన్ లు వాడే కంటే ఇంట్లోనే పలు సహజసిద్ధ పదార్థాలు వాడి గొంతు నొప్పి తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి.

అయితే అలా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వేడివేడిగా చికెన్ సూప్ తాగాలి.

ఆయా సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది.అంతేకాకుండా జలుబు ఉన్న కూడా తగ్గిపోతుంది.ఇక లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క( Cinnamon ), అల్లం లాంటి పదార్థాలను వేడి చేసి టీ తయారు చేసుకుని వేడివేడిగా తాగాలి.

Advertisement

ఈ మసాలా టీతో గొంతు నొప్పి ఉంటే వెంటనే తగ్గిపోతుంది.ఇక జలుబు, దగ్గు( Cough ) లాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ టీ తో వెంటనే తగ్గిపోతాయి.

ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు వేయాలి.ఆ నీటిని బాగా మరిగించాలి.దీంతో చక్కని అల్లం రసం ( Ginger juice )తయారు అవుతుంది.

అప్పుడు ఆ రసాన్ని వడగట్టుకుని వేడిగా ఉన్నప్పుడే తాగాలి.దీంతో గొంతు నొప్పి వెంటనే తగ్గిపోతుంది.తేనే, నిమ్మరసం( Honey Lemon ) కూడా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి.

వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.అంతే కాకుండా ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడతాయి.ఇక జలుబు( Cold ) ఉన్నవారు కూడా ఈ నీటిని తాగడం వలన వెంటనే తగ్గిపోతుంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

నల్ల మిరియాలు తో చేసిన చారు తిన్న కూడా గొంతు నొప్పి వెంటనే తగ్గుతుంది.అలాగే పాలలో మిరియాలు వేసి బాగా మరిగించి తాగిన కూడా జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గిపోతాయి.

Advertisement

తాజా వార్తలు