విజయ్ సేతుపతి పూరీ కాంబో మూవీలో హీరోయిన్ ఆమేనా.. బన్నీ రీల్ తల్లి నటిస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannath ) గురించి మనందరికీ తెలిసిందే.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నప్పటికి ఆయనకు మాత్రం సరైన సక్సెస్ రావడం లేదు.

చివరిగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి.

ఈ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు.ఎలా అయినా తదుపరి సినిమాతో సరైన సక్సెస్ ను సాధించాలని చూస్తున్నారు పూరీ జగన్నాథ్.

అందులో భాగంగానే ఇప్పుడు పూరి కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారట.

This Time Puri Is Trying Differently Details, Puri Jagannath, Vijay Sethupathi,
Advertisement
This Time Puri Is Trying Differently Details, Puri Jagannath, Vijay Sethupathi,

డిఫరెంట్ స్టోరీ రాసుకొని, విజయ్ సేతుపతిని( Vijay Sethupathi ) ఒప్పించారట.ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.ఇప్పుడీ డిఫరెంట్ కథలోకి ఫిమేల్ లీడ్ గా టబును తీసుకున్నారట.

ఇదే విషయాన్ని తాజాగా ఎనౌన్స్ చేశారు.అల వైకుంఠపురములో సినిమా తర్వాత తెలుగులో టబు( Tabu ) అంగీకరించిన సినిమా ఇదే.అంటే దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ లో ఆమె తిరిగి నటిస్తోందీ.మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానని ప్రకటించిన ఈ సీనియర్ నటి, పూరి జగన్నాధ్ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, బలంగా ఉంటుందని చెబుతోంది.

కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌ లో మొదలవుతుందట.

This Time Puri Is Trying Differently Details, Puri Jagannath, Vijay Sethupathi,

ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు.ఇతర నటీనటులతో పాటు, మ్యూజిక్ డైరక్టర్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారట.అయితే ఈ సినిమా ఎలా అయినా సక్సెస్ అవ్వాలని పూరి జగన్నాథ్ కోరుకుంటున్నారు.

బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!
ఆ ఆలోచన వచ్చిన తొలి హీరో చిరంజీవి.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.మరి ఈ సినిమాతో అయినా పూరి జగన్నాత్ సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి మరి.అంతేకాకుండా పూరి జగన్నాథ్ కు ఈ సినిమా హిట్ అవడం చాలా ముఖ్యం.ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే తప్ప పూరితో నెక్స్ట్ సినిమాలు చేయడానికి స్టార్స్ ఒప్పుకోరు.

Advertisement

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి మరి.

తాజా వార్తలు