మీరు మ‌ధుమేహం బాధితులా? అయితే మీ డైట్‌లో ఈ జ్యూస్‌ను చేర్చాల్సిందే!

మ‌ధుమేహం.ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని స‌త‌మ‌తం చేస్తున్న దీర్ఘ‌కాలిక వ్యాధి ఇది.

ఒక్క‌సారి వ‌చ్చిందంటే జీవిత కాలం వేధించే మ‌ధుమేహంను చ‌క్కెర వ్యాధి, డ‌యాబెటిస్ అని కూడా పిలుస్తుంటారు.పేరు ఏదైనా వ్యాధి ఒక్క‌టే.

పైగా మ‌ధుమేహం బారిన పడ్డ వారు నీర‌సం, తీవ్ర‌మైన అల‌స‌ట‌, అధిక దాహం, ఆక‌లి ఎక్కువ‌గా ఉండ‌టం, కంటి చూపు మంద‌గించ‌డం, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌టం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.అయితే వాట‌న్నిటికీ చెక్ పెట్టి షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్ చేయ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్రీన్ యాపిల్‌, ఒక క్యారెట్ ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, గ్రీన్ యాపిల్ ముక్క‌లు, పీల్ తొల‌గించి దంచి పెట్టుకున్న అంగుళం అల్లం ముక్క‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.చివ‌రిగా అందులో వ‌న్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేస్తే హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ యాపిల్ క్యారెట్ జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ జ్యూస్ మ‌ధుమేహం బాధితుల‌కు ఒక వ‌ర‌మ‌నే చెప్పుకోవ‌చ్చు.రోజుకు ఒక గ్లాస్ చ‌ప్పున ప్ర‌తి రోజు ఈ గ్రీన్ యాపిల్ క్యారెట్ జ్యూస్‌ను తీసుకుంటే నీర‌సం, అల‌స‌ట వంటివి దూరం అవుతాయి.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

ముడ‌త‌లు పోయి ముఖం నిగారింపుగా మారుతుంది.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

అతి ఆక‌లి స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు