మీ గుండె ఆరోగ్యంగా, బ‌లంగా ఉండాలంటే త‌ప్ప‌కుండా దీన్ని తీసుకోండి!

నేటి ఆధునిక కాలంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.

ఆహార‌పు అల‌వాట్లు, స్ట్రెస్‌, జీన‌వ శైలిలో మార్పులు, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, హై కొలెస్ట్రాల్‌, ధూమ‌పానం, మ‌ద్య‌పానం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, అతిగా ఎక్సర్​సైజ్​ లు చేయ‌డం వంటి ర‌క‌ర‌కాల అంశాలు గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయి.

ఇక ఒక్క‌సారి గుండె జ‌బ్బుల‌కు గుర‌య్యారంటే జీవితాతం గాజు బొమ్మ మాదిరి ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంటుంది.అందుకే గుండె జ‌బ్బులు వ‌చ్చాక బాధ‌ప‌డ‌టం కంటే రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం.

అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే హెల్తీ స్మూతీ సూప‌ర్ గా హెల్ప్ చేస్తుంది.మ‌రి ఆ స్మూతీ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక క‌ప్పు వేయించిన ఫూల్ మఖానా వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత అదే బ్లెండ‌ర్‌లో క‌ట్ చేసి పెట్టుకున్న అర‌టి పండు ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజ‌లు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ పీన‌ట్ బ‌ట‌ర్‌, ఒక గ్లాస్ ఆల్మండ్ మిల్క్ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే ఫూల్ మ‌ఖానా బ‌నానా స్మూతీ రెడీ అవుతుంది.

ఈ స్మూతీ టేస్టీగా ఉండ‌టమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.త‌ర‌చూ ఈ స్మూతీని తీసుకుంటే.అందులో ఉండే ప‌లు అమోఘ‌మైన పోష‌క విలువ‌లు గుండెను ఆరోగ్యంగా, బ‌లంగా మారుస్తాయి.

అదే స‌మ‌యంలో ర‌క్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.దాంతో గుండె సంబంధింత జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు