ఇండియాలో రోజూ ఏదో ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ( Electric scooter )రిలీజ్ అవుతుంది.
కాకపోతే ఇవి మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న చాలామందిలో ఎదురవుతుంది.
దానివల్ల కొందరు వీటిని కొనుగోలు చేయడం లేదు.కాగా దీనికి కూడా ఒక పరిష్కారాన్ని కొన్ని కంపెనీలు చూపుతున్నాయి.
హైబ్రిడ్ మోడల్స్ తీసుకొస్తూ చార్జింగ్ అయిపోయిన వెంటనే పెట్రోల్ కొట్టించుకొని ప్రయాణాలను కొనసాగించే వెసులుబాటును కల్పిస్తున్నాయి.అలాంటి వాటిలో ప్రస్తుతం యమహా ఫ్యాసినో 125 Fi ( Yamaha Fascino 125 Fi ) బెస్ట్ స్కూటర్ గా నిలుస్తోంది.
హైబ్రిడ్ అనేది పెట్రోల్, బ్యాటరీ పవర్ కాంబినేషన్‌లో నడిచే ఈ స్టైలిష్ స్కూటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఆఫర్ చేస్తుంది.ఇది 8.2 PS పవర్, 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేసే 125cc, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది.స్కూటర్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ ( Smart motor generator )(SMG) కూడా ఉంది, ఇది అదనపు 0.6 Nm టార్క్‌ను అందిస్తుంది, ఇది మెరుగైన యాక్సిలరేషన్, పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుంది.
Fascino 125 Fi హైబ్రిడ్ 68.75 kmpl మైలేజీని అందిస్తుంది.90 kmph టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది.ఈ స్పీడ్ తో సుధీర ప్రాంతాలను కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు.
ఇది 14 కలర్ ఆప్షన్లతో 5 వేరియంట్లలో లభిస్తుంది.స్కూటర్‌లో 5.2-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్, USB ఛార్జర్, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ వంటి ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ ప్రారంభ ధర రూ.79,600 కాగా స్కూటర్ టాప్ మోడల్ రూ.92,530కి అందుబాటులో ఉంది.మొత్తం మీద యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ స్టైలిష్, ఎక్కువ మైలేజీ, శక్తివంతమైన స్కూటర్ కోసం చూస్తున్న వారికి మంచి ఎంపిక.
బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జర్ వంటి అధునాతన ఫీచర్లతో కూడిన స్కూటర్ కావాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపిక.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy