మెద‌డు చురుగ్గా మారాలా? అయితే ఈ పొడిని డైట్‌లో చేర్చాల్సిందే!

ప్ర‌స్తుత టెక్నాల‌జీ కాలంలో బిజీ లైఫ్‌ స్టైల్ కార‌ణంగా చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లతో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.

ఈ మాన‌సిక స‌మ‌స్య‌లు మెద‌డు ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేయ‌డ‌మే కాదు.

దాని పని తీరును సైతం దెబ్బ తీస్తాయి.దాంతో ఆలోచ‌న శ‌క్తి, జ్ఞాప‌క శ‌క్తి రెండు స‌న్న‌గిల్లుతాయి.

అందుకే మెద‌డు ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మెదడుకు అవ‌స‌రం అయ్యే విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు అందేలా చూసుకోవాలి.

అలాగే మెద‌డును చురుగ్గా మార్చేందుకు ఇప్పుడు చెప్ప‌బోయే పొడి కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ పొడి ఏంటీ.

Advertisement

దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక క‌ప్పు బాదం ప‌ప్పులు వేసి వేయించుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఆ త‌ర్వాత అదే పాన్ లో అర క‌ప్పు వాల్ న‌ట్స్ ను కూడా వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చ‌ల్లార‌బెట్టుకున్న బాదం ప‌ప్పులు, వాల్ న‌ట్స్‌, రెండు టేబుల్ స్పూన్ల సోంపు వేసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.

చివ‌రిగా అందులో ఐదు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసి అంతా క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకుని ఏదైనా ఒక గాజుసీసాలో గాలి త‌గ‌లకుండా స్టోర్ చేసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్‌కు ముందు లేదా బ్రేక్ ఫాస్ట్‌కు త‌ర్వాత గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో త‌యారు చేసిపెట్టుకున్న పొడిని ఒక స్పూన్ చ‌ప్పున క‌లిపి సేవించాలి.ప్ర‌తి రోజు ఈ పొడిని పాల‌ల్లో క‌లిపి తీసుకుంటే మెద‌డు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.ఆలోచ‌న శ‌క్తి, జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతాయి.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

ప‌నిపై ఏకాగ్ర‌త పెరుగుతుంది.అంతేకాదు, ఈ పొడిని రోజు ఉద‌యాన్నే తీసుకుంటే ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు సైతం పరార్ అవుతాయి.

Advertisement

తాజా వార్తలు