రోజు ఉదయం ఈ కషాయం తాగితే పొట్ట తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి!

ఇటీవల కాలంలో బాన పొట్టతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.పొట్ట పెరగడానికి కారణాలు అనేకం.

అలాగే తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకునే కొన్ని పానీయాలు పొట్టను చాలా వేగంగా కరిగిస్తాయి.

అందులో ఇప్పుడు చెప్పబోయే కాషాయం కూడా ఒకటి.రోజు ఉదయం ఈ కాషాయం తాగితే పొట్ట తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య లాభాలు( Health benefits ) మీ సొంతం అవుతాయి.

మరి ఇంతకీ పొట్టని కరిగించే ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా అంగుళం అల్లం ముక్కని( ginger ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.

ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmaric ) మరియు పది ఫ్రెష్ పుదీనా ఆకులు, ఐదు తులసి ఆకులు( Basil leaves ) వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.వాటర్ బాగా మరిగిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

స్టైనర్ సహాయంతో తయారు చేసుకున్న కషాయాన్ని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

కావాలి అనుకుంటే మీరు ఇందులో లెమన్ జ్యూస్( Lemon juice ), హనీ వంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు.నిత్యం ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఈ కషాయాన్ని కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అలాగే ఈ కషాయంలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Advertisement

జలుబు, దగ్గు వంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తాయి.అలాగే ఈ కషాయం కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.

శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.అలాగే రెగ్యులర్ డైట్ లో ఈ కషాయాన్ని చేర్చుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.

తాజా వార్తలు