కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాలను వెలిగిస్తే జరిగేది ఇదే..?

మన దేశంలోని దాదాపు చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ( Kartika masam )ఎంతో పవిత్రంగా నియమ నిష్ఠతో జరుపుకుంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే నవంబర్ 14వ తేదీ నుంచి కార్తిక మాసం మొదలవుతుంది.

అలాగే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండడం వల్ల దీనికి కార్తికం అనే పేరు వచ్చింది.కార్తిక మాసమునకు సమానమైన మాసము, విష్ణువుకు సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రము, గంగ కంటే పుణ్యతీర్ధము లేవని పురాణాలలో ఉంది.

ఇంకా చెప్పాలంటే కార్తీక మాసము శివ కేశవులకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసము అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇది పుణ్య స్నానాలకు, వివిధ వ్రతాలకు అత్యంత శుభప్రదమైనది.

This Is What Happens If You Light The Dead Lamps In The Month Of Kartika , Karti

ఈ నెలలో ఒంటి పుట భోజనం, సాయంత్రం వేళ తులసి వద్ద దీపాలు వెలిగించడం ఎంతో పుణ్యప్రదం అనే పండితులు చెబుతున్నారు.అలా దీపాలు వెలిగించని వారు, ఆరిన దీపాలు ( Extinguished lamps )వెలిగించిన, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డుగా పెట్టిన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.ఇంకా చెప్పాలంటే ఈ మాసం అంతా సూర్యోదయానికి ముందే నది స్నానం లేదా ఏదైనా జలాశయంలో స్నానం చేసి, బిల్వ పత్రాలతో ( Bilwa leafs )శివుని అర్చన, అభిషేకం, సాయంత్రం దీపారాధన చేస్తారు.

Advertisement
This Is What Happens If You Light The Dead Lamps In The Month Of Kartika , Karti

అలాగే ఈ మాసంలో కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చొప్పున పారాయణం చేయడం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

This Is What Happens If You Light The Dead Lamps In The Month Of Kartika , Karti

ముఖ్యంగా చెప్పాలంటే కార్తిక మాసం మొదటి రోజు సాయంత్రం నుంచి దేవాలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.ఈ దీపానికి నమస్కరించి శివాలయంలో దీపారాధన చేసిన వారికి మరో జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి వంటి రోజులు శివ,కేశవ అర్చకులకు ఎంతో ప్రశస్తమైనవివని ఈ పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు