యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ మధ్య ఉన్న ఈ పోలిక గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshajna ) సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా ఈ నటుడి సినీ ఎంట్రీ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఈ ఏడాదైనా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.

బాలయ్య ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండటంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో ఒకింత కన్ఫ్యూజన్ నెలకొంది.అయితే మోక్షజ్ఞ స్నేహితులలో ఒకరైన బెల్లంకొండ గణేష్( Bellamkonda Ganesh ) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞకు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నేను, మోక్షజ్ఞ కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లమని గణేష్ అన్నారు.మేమిద్దరం కలిసి రచ్చ సినిమాకు వెళ్లామని ఆయన కామెంట్లు చేశారు.

బాలయ్య బాబు( Balayya Babu ) అబ్బాయి రచ్చ సినిమాకు వచ్చారని కొంతమంది కామెంట్స్ చేశారని ఆయన తెలిపారు.

This Is The Similarities Between Ntr And Mokshagna Details Here Goes Viral , Nt
Advertisement
This Is The Similarities Between Ntr And Mokshagna Details Here Goes Viral , NT

మోక్షజ్ఞ ఆరంగేట్రం త్వరలోనే ఉంటుందని బెల్లంకొండ గణేష్ కామెంట్లు చేశారు.ఇప్పుడు మోక్షజ్ఞ ఫుల్ లెంగ్త్ ప్రిపరేషన్ లో ఉన్నాడని గణేష్ పేర్కొన్నారు.2025లోపు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఆయన తెలిపారు.మోక్షజ్ఞ మంచి యాక్టర్ అవుతాడని మోక్షజ్ఞ డ్యాన్స్ లో మంచి ఈజ్ ఉందని గణేష్ అన్నారు.

మోక్షజ్ఞ డైలాగ్స్ చెప్పే సమయంలో ఐ బ్రోస్ లో రైట్ ఐ బ్రో కావాలంటే రైట్ ఐ బ్రోను లెఫ్ట్ ఐ బ్రో కావాలంటే లెఫ్ట్ ఐ బ్రోను కదిలిస్తాడని ఆయన పేర్కొన్నారు.

This Is The Similarities Between Ntr And Mokshagna Details Here Goes Viral , Nt

అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే విధంగా డైలాగ్స్ చెబుతారనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్, మోక్షజ్ఞ( NTR, Mokshajna ) మధ్య ఉన్న ఈ పోలికలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఎన్టీఆర్, మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు