జిడ్డు చ‌ర్మంతో వ‌ర్రీ వ‌ద్దు.. ఇలా చేస్తే ముఖం ఫ్రెష్‌గా మెరిసిపోతుంది!

జిడ్డు చర్మ తత్వం కలిగిన వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

చర్మంపై ఆయిల్ ఉత్పత్తి అధికంగా ఉండ‌టం వల్ల వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

పైగా ఆయిలీ స్కిన్ వారు మేకప్ వేసుకోవడానికి కూడా జంకుతుంటారు.ఎందుకంటే మేకప్ వేసుకున్న కొద్ది నిమిషాలకే చెదిరి పోతుంది.

పైగా ముఖం కాంతిహీనంగా త‌యార‌వుతుంది.అందుకే ఆయిలీ స్కిన్ ను వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ప్రయత్నిస్తే గ‌నుక ముఖాన్ని ఫ్రెష్ గా మరియు బ్లోయింగ్ గా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల సోయా బీన్స్ మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement
This Is The Remedy That Makes Oily Skin Fresh Details! Home Remedy, Latest News,

మరుసటి రోజు నానబెట్టుకున్న సోయా బీన్స్ ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి సోయా పాలను వేరు చేయాలి.

This Is The Remedy That Makes Oily Skin Fresh Details Home Remedy, Latest News,

ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి మరియు సరిపడా సోయా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాలపాటు ఆరబెట్టుకుని అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్‌ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒకసారి చేస్తే కనుక చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో చర్మం ఫ్రెష్ గా మరియు గ్లోయింగ్‌గా మారుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై మొండి మొటిమలు, వాటి తాలూకు మచ్చలు సైతం దూరం అవుతాయి.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు