శరత్ బాబు రమాప్రభ విడిపోవడానికి కారణం ఇదే...

తెలుగు సినిమా పరిశ్రమలో నటులుగా శరత్ బాబు ( Sarath Babu ) రమ ప్రభలకు ( Rama Prabha ) మంచి పేరు ఉంది.

చిన్న వయస్సు నుంచే సినిమా పరిశ్రమలో రాణించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న వీరు ఎన్నో సినిమాలలో కలిసి పనిచేశారు.

అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీయగా అది కాస్తా పెళ్లి దాకా వెళ్ళింది.అయితే ఆ పెళ్లి పెటాకులు కావడం వారి అభిమానులను నిరాశ పరిచింది.

తాజాగా శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి ( Sarath Babus health condition )ఆందోళన కరంగా ఉండటంతో ఆయనకి సంబందించిన పలు విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .ముఖ్యంగా అయన పెళ్లి , విడిపోవడం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది .శరత్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.గత కొద్ది రోజులుగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు .ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 20వ తేదీన ఆయనను హైదరాబాదులోని హాస్పిటల్ కి తరలించారు.వెంటిలేటర్ కింద ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ప్రముఖ లేడీ కమెడియన్ రమాప్రభ తో శరత్ బాబు ప్రేమాయణం కొనసాగించి పెళ్లి చేసుకున్నారు.

Advertisement

అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు వాస్తవానికి శరత్ బాబును చూడగానే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడిపోతుంది .అలాగే అప్పటికే సినిమా రంగంలో లో సెటిల్ అయిన రమాప్రభ కూడా శరత్ బాబును ప్రేమించింది.ఆయన కూడా ఆమె మంచితనం నచ్చి ఇష్టపడ్డాడు.

కానీ వివాహం తర్వాత వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అన్న విషయాన్ని గ్రహించారు.చివరికి వారిద్దరూ మనస్పర్ధలు కారణంగా వైవాహిక జీవితానికి దూరం అయ్యారు.

వయసులో శరత్ బాబు కన్నా రమాప్రభ పెద్దదైన వివాహం చేసుకున్నారు .అయితే అనుకోని గొడవల వలన విడిపోవాల్సి వచ్చింది .

అప్పటి నుంచి రమాప్రభ ఒంటరిగాజీవితాన్ని కొనసాగిస్తోంది .అప్పట్లో వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కలగడమే కాదు రమా ప్రభ ఆస్తులను శరత్ బాబు కరిగించేశాడు అన్న ఆరోపణ కూడా శరత్ బాబు పైన ఉంది.ఆయన వల్లే ఆమె రోడ్డున పడ్డాను అని తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను అని రమా ప్రభ కూడా పలు సందర్భాల్లో కన్నీటి పర్యంతమయింది.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?

ఏదేమైనా ఇద్దరు విడిపోవడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది .

Advertisement

తాజా వార్తలు