ఆర్మూర్ లో కాంగ్రెస్ రాజీవ్ రైతు దీక్ష చేపట్టడం వెనుక అసలు వ్యూహం ఇదే

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరిగి ప్రజలలో ఉండడానికి ప్రయత్నిస్తోంది.

ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే తప్ప ప్రజల మద్దతు పొందలేమని గ్రహించిన కాంగ్రెస్ తిరిగి ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా వ్యూహాలను రచిస్తోంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో రాజీవ్ రైతు దీక్ష చేపట్టింది.పసుపు బోర్డు అనేది పసుపు రైతుల చిరకాల వాంఛ.

This Is The Real Strategy Behind The Congress Rajiv Raitu Initiation In Armor Co

పసుపు బోర్డు హామీని నెరవేర్చలేదని చెప్పి మాజీ ఎంపీ కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసి చిత్తుచిత్తుగా ఓడించిన విషయం మనం చూసాం.ఇక ఆగ్రహంతో ఉన్న పసుపు రైతులకు నన్ను ఎంపీగా గెలిపిస్తే నెల రోజుల్లో పసుపు బోర్డు తీసుకవస్తా అని హామీ ఇవ్వడంతో బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ ను నిజామాబాద్ ఎంపీగా గెలిపించడం జరిగింది.

ఎంపీగా గెలుపొందిన ఇప్పటివరకూ పసుపు బోర్డు హామీని నిలబెట్టుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లా పసుపురైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఇక ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సమస్య కావడంతో ఈ సమస్యపైన ఉద్యమిస్తే ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు లభిస్తోందని వ్యూహంతో ఈ దీక్షను చేపట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని రైతు దీక్ష వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ వాటిని రాష్ట్ర వ్యాప్త సమస్యగా చిత్రికరించి కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు తెచ్చే విధంగా కాంగ్రెస్ పోరాడుతున్నారని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు