లక్ష్మీదేవి దీపారాధనలో ఐదు ఒత్తుల.. వెనుక ఉన్న అంతరార్థం ఇదే..!

దీపం అంటే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) స్వరూపం అని దాదాపు చాలా మంది పండితులు చెబుతూ ఉంటారు.

అంతే కాకుండా దీపంలో సకల దేవతలు, వేదాలు కొలువై ఉన్నాయని పురాణాలలో ఉంది.

దీపంలో కాంతి ఒకటే కాకుండా శాంతి కూడా ఉంటుంది.అలాగే దీపాన్ని చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.

దీపావళి పండుగకు ముందుగా లక్ష్మీ పూజకు దీపారాధన చేస్తారు.ఆ దీపారాధన కుందిలో వేసే వత్తులు కూడా ప్రధానమైనవే అని పండితులు చెబుతున్నారు.

ఈ దీపపు కుండీలో ఐదు ఒత్తులు వేసి ఇంటి ఇల్లాలు వెలిగించాలి.అలాగే గృహిని స్వయంగా 5 వత్తులు వెలిగించాలి.

Advertisement
This Is The Meaning Behind Five Accents In Lakshmi Deeparadhana , Goddess Laks

ఈ ఐదు వత్తుల్లో చక్కటి అర్థం ఉంది.

This Is The Meaning Behind Five Accents In Lakshmi Deeparadhana , Goddess Laks

అలాగే కుటుంబ సంక్షేమం కూడా ఉంది.ఇంటి సౌభాగ్యం కూడా ఉందని పండితులు చెబుతున్నారు.ఈ ఐదు వత్తుల్లో మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసం,రెండవ వత్తి అత్త మామల క్షేమం కోసం, మూడవ వత్తి తోబుట్టువుల క్షేమం కోసం, నాలుగో వత్తి ఇంటి గౌరవం, ఐశ్వర్యం, ధర్మం కోసం, 5వ వత్తి వంశాభివృద్ధి కోసం వెలిగిస్తారు.

ఇలా 5 వత్తులు వెలిగిస్తే సిరి సంపదలతో పాటు కుటుంబ క్షేమం, ధనాభివృద్ధి కలుగుతుంది.దీపారాధన ఎవరు చేసినా కనీసం రెండు వత్తులు తప్పనిసరిగా ఉండాలా చూసుకోవాలి.

కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఒత్తితో దీపం( Deepam ) వెలిగించకూడదని నిపుణులు చెబుతున్నారు.

This Is The Meaning Behind Five Accents In Lakshmi Deeparadhana , Goddess Laks
దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

అలాగే రెండు అంటే జంట.భార్యా భర్తలను జంట అని పిలుస్తారు.అలాగే హిందూ పురాణాలలో జంటకు ఎంతో విశిష్టత ఉంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే దీపారాధనకు నువ్వుల నూనె ను మాత్రమే ఉపయోగించాలి.ఇది సంప్రదాయపరంగానే కాక, శాస్త్ర పరంగా కూడా ఎంతో మంచిది.

అలాగే అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది.కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యా భర్తలు అన్యోన్యంగా జీవిస్తారని,అలాగే వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే వేరుశనగ నూనెను దీపారాధనకు అస్సలు ఉపయోగించకూడదని పండితులు ( Scholars )చెబుతున్నారు.

తాజా వార్తలు