మొత్తం భారతదేశంలోనే అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ ఇదే!

భారతీయ రైల్వే( Indian Railways ) గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు.యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా భారతీయ రైల్వే వెలుగొందుతోంది.

అందుకే రైల్వే లేని భారతాన్ని మనం ఊహించుకోలేము.ప్రతి భారతీయుడి జీవితంలో రైల్వేలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని చెప్పుకోవచ్చు.

దేశంలో ప్రతిరోజూ 13,169 ప్యాసింజర్ రైళ్లు, నడుస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? పైగా వాటిలో దాదాపు 2 కోట్ల 40 లక్షల మంది ప్రయాణిస్తూ వుంటారు.ఇంకా భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది.

ముఖ్యంగా ప్రధాన స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది.

This Is The Largest Railway Station In All Of India, This Is The, Kolkata , Howr
Advertisement
This Is The Largest Railway Station In All Of India, This Is The, Kolkata , Howr

దానిలో మొదటగా "కోల్‌కతా హౌరా రైల్వే జంక్షన్ ప్రైడ్"( Kolkata Howrah Railway Junction Pride ) గురించి మాట్లాడుకోక తప్పదు.పశ్చిమ బెంగాల్‌లో వున్న హౌరా భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.ఇది ఉంది.

అందుకే హౌరా జంక్షన్ కోల్‌కతాకు గర్వకారణం అని అంటూ వుంటారు.ఇక్కడ ఏకంగా 23 ప్లాట్‌ఫారమ్‌లు, 26 ట్రాక్‌లు ఉన్నాయి.

ఆ తరువాత "సీల్దా రాయల్ స్టేషన్" ( Sieldas Royal Station )గురించి చెప్పుకోవాలి.ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ప్రసిద్ధి గాంచింది.

బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ స్థాపించి 158 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం 27 ట్రాక్‌లు, 21 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ఈ లిస్టులో తరువాతది "ముంబై CST." ముంబైలో ఉన్న "ఛత్రపతి శివాజీ టెర్మినస్" భారతీయ రైల్వేలకు గర్వకారణం.ఈ రైల్వే స్టేషన్‌లో 20 ట్రాక్‌లు, 18 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

This Is The Largest Railway Station In All Of India, This Is The, Kolkata , Howr
Advertisement

ఆ తరువాత "న్యూఢిల్లీ రైల్వే స్టేషన్" ( New Delhi Railway Station )గురించి వివరించాలి.దేశ రాజధానిలో ఉన్న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ గా పేరుగాంచింది.ఇక్కడ 18 ట్రాక్‌లు, 16 ప్లాట్‌ఫారమ్‌లు కలవు.

చివరగా "చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్" గురించి మాట్లాడుకోవాలి.దక్షిణ భారతదేశంలో ఉన్న చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని టాప్ 5 రైల్వే స్టేషన్లలో ఒకటి.

ఇక్కడి నుంచి రోజుకు 50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో 30 ట్రాక్‌లు మరియు 12 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

తాజా వార్తలు