పాల ఉత్పత్తి పెరగాలంటే బాలింతల డైట్ లో ఇది ఉండాల్సిందే!

ప్రసవం అనంతరం బిడ్డకు తల్లిపాలు (Breastfeeding a baby)ఎంత శ్రేష్టకరమో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అయితే కొందరు బాలింతల్లో పాల ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది.

అలాంటివారు కచ్చితంగా పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ఆ కోవకే చెబుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు బాదం గింజలు(Almonds), నాలుగు జీడిపప్పులు(Cashews), మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు(Dates), వన్ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, మూడు డ్రై అంజీర్ వేసి వాట‌ర్ తో ఒకసారి వాష్‌ చేసుకోవాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వేసుకోవాలి.అలాగే ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన జ్యూస్ అనేది రెడీ అవుతుంది.

This Is The Juice That Increases Milk Production In New Moms Dry Fruit Juice, N
Advertisement
This Is The Juice That Increases Milk Production In New Moms! Dry Fruit Juice, N

డ్రై ఫ్రూట్ జ్యూస్(Dry Fruit Juice) ను డైట్ లో కనుక చేయించుకుంటే బాలింతలో పాల ఉత్పత్తి చక్కగా మెరుగు పడుతుంది.ఈ జ్యూస్ లో ప్రోటీన్, ఫైబర్ (Protein, fiber)తో పాటుగా పలు రకాల విటమిన్స్, మినరల్స్, మేలు చేసే కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి.ఈ జ్యూస్ ను బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

This Is The Juice That Increases Milk Production In New Moms Dry Fruit Juice, N

అలాగే డెలివరీ నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా ఈ జ్యూస్ సహాయపడుతుంది.ఈ జ్యూస్ లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ప్రసవం సమయంలో కోల్పోయిన బ్లడ్ ను త్వరగా రికవరీ చేయగలుగుతారు.రక్తహీనత దూరమవుతుంది.

అంతేకాకుండా ఈ జ్యూస్ ఎముకలను బలోపేతం చేస్తుంది.డెలివరీ తర్వాత వచ్చే నడుపు నొప్పికి చెక్ పెడుతుంది.

ఇక చాలామంది ప్ర‌స‌వం అనంత‌రం హెయిర్ ఫాల్ తో బాధపడుతుంటారు.అయితే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు