ఇదేందయ్యా ఇది, వరుడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసిన దోస్త్.. వీడియో వైరల్!

ఈ రోజుల్లో పెళ్లిలలో జరిగే కొన్ని చిలిపి పనులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ కోవకు చెందిన మరొక వీడియో తాజాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోలో వరుడి దండ నుంచి ఒక స్నేహితుడు డబ్బులు కొట్టేశాడు.ఈ వీడియోని మీమ్ లజీ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

అప్‌లోడ్ చేయగానే వైరల్ ఐన ఈ వీడియో ఇప్పటికే లక్షకు పైగా లైక్స్ సాధించింది.వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి కొడుకు తన మెడలో కరెన్సీ నోట్ల దండను వేసుకొని కుర్చీలో కూర్చుని ఉండడం చూడవచ్చు.

అతని పక్కనే స్నేహితులతో పాటు బంధుమిత్రులు కూర్చున్నారు.అయితే పక్కనే కూర్చున్న ఒక స్నేహితుడు పెళ్ళికొడుకు దండ నుంచి కరెన్సీ నోట్లు కొట్టేశాడు.

Advertisement

గుట్టుచప్పుడు కాకుండా మెల్లగా ఇతడు డబ్బులను దొంగలించాడు.దొంగలించిన డబ్బును తన జేబులో కుక్కేసాడు.

పెళ్లి హడావిడిలో ఉన్న వరుడు దీనిని గమనించలేకపోయాడు.అయితే అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి మాత్రం ఈ దోస్త్ చేస్తున్న దొంగతనాన్ని వీడియో తీశాడు.

అనంతరం దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

పెళ్లి కొచ్చి ఇదేం పాడు బుద్ది రా నాయనా అని కొంతమంది అంటుంటే.ఇతనొక ఇండియన్ మనీ హెయిస్ట్ అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

ఈ ఫన్నీ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement