భారీ కండల కోసం ఆరాటపడే పురుషులు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి!

చాలా మంది పురుషులు కండలను భారీగా పెంచుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.మజిల్స్ బిల్డ్ చేసుకునేందుకు ఎన్నో ఆహార నియమాలు పాటిస్తుంటారు.

అలాగే రెగ్యులర్ గా కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు.మీరు కూడా భారీ కండల కోసం ఆరాటపడుతున్నారా.? అయితే తప్పకుండా మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఉండాల్సిందే.ఈ స్మూతీ ఆరోగ్యంగా మరియు వేగంగా కండలు పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్‌ మరియు ఒక కప్పు వాటర్ పోసి కనీసం ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు ఒక అరటి పండు తీసుకుని తొక్క తొలగించి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్, నానబెట్టుకున్న ఓట్స్, మూడు నుంచి నాలుగు ఫ్రెష్ పాలకూర ఆకులు, మూడు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న వాల్ న‌ట్స్‌, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వ‌న్‌ టేబుల్ స్పూన్ జనపనార విత్తనాలు, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు మరియు ఒక గ్లాస్ పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ స్మూతీ సిద్దమవుతుంది.

Advertisement

ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ప్రోటీన్ తో సహా ఎన్నో విలువైన పోషకాలు ఈ స్మూతీలో నిండి ఉంటాయి.ఈ స్మూతీ కండరాల నిర్మాణానికి అద్భుతంగా సహాయపడతాయి.

భారీ కండల కోసం ఆరాటపడేవారు వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఈ స్మూతీని తీసుకోవాలి.తద్వారా కండలు తిరిగిన దేహం మీ సొంతమవుతుంది.

పైగా ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉంటే దూరమవుతుంది.గుండె పోటు, హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఎముకలు పటిష్టంగా తయారవుతావడనికి, ఎముక సాంద్రత ను పెంచడానికి సైతం ఏ స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు