ఒత్తైన జుట్టు కోసం ఆరాట‌పడుతున్న పురుషుల‌కు బెస్ట్ ఆయిల్ ఇది..!

అధిక ఒత్తిడి, పోషకాహార లోపం, ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు, కాలుష్యానికి ఎక్కువగా బహిర్గతం కావడం, ఫోన్ లాప్ టాప్ వంటి గాడ్జెట్లతో గంటలు తరబడి గడపడం తదితర కారణాల వల్ల చాలా మంది పురుషుల్లో జుట్టు అధికంగా రాలిపోయి పలచగా మారుతుంటుంది.

మగవారికి కలర్ తక్కువ ఉన్న పర్వాలేదు కానీ జుట్టు( Hair ) మాత్రం ఎక్కువగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు.

అందుకే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు పురుషులు నానా తంటాలు పడుతుంటారు.అయితే ఒత్తైన జుట్టు( Thick Hair ) కోసం ఆరాటపడుతున్న పురుషులకు ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ది బెస్ట్ వన్ గా వర్కోట్ అవుతుంది.

ఆయిల్ తయారీ కోసం.ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను( Ginger ) పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కలబంద ముక్కలు వేసుకోవాలి.

Advertisement

వీటితో పాటు నాలుగు రెబ్బలు కరివేపాకు మరియు వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్‌ వేసి చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను( Oil ) ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసి ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను తల స్నానం చేయడానికి నాలుగు గంటలు ముందు లేదా నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆయిల్ ను కనుక పురుషులు ఉపయోగిస్తే అదిరిపోయే రిజల్ట్ పొందుతారు.ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.కొద్ది రోజుల్లోనే పల్చగా ఉన్న మీ హెయిర్ ను చాలా ఒత్తుగా మారుస్తుంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అలాగే ఈ ఆయిల్ వాడటం వల్ల చుండ్రు సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

Advertisement

మరియు హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ సైతం మారతాయి.

తాజా వార్తలు