ముఖంపై మ‌చ్చ‌ల‌ను తొల‌గించి తెల్ల‌గా మార్చే ఎఫెక్టివ్ సీర‌మ్‌ ఇదే!

ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ.ముఖ చ‌ర్మంపై ఏదో ఒక కార‌ణం చేత న‌లుపు లేదా గోధుమ రంగు మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూనే ఉంటాయి.

ఈ మ‌చ్చ‌లు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని త‌క్కువ చేసి చూపిస్తాయి.అందుకే ముఖంపై ఏమైనా మ‌చ్చ‌లు ప‌డ్డాయంటే.

వాటిని త‌గ్గించుకోవ‌డం కోసం తెగ హైరానా ప‌డిపోతుంటారు.ర‌క‌ర‌కాల క్రీములు, ఫేస్ ప్యాకులు, మాస్కులు వాడుతూ.

వాటిని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ సీర‌మ్ ను ట్రై చేస్తే సుల‌భంగా మ‌రియు వేగంగా మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకుని ముఖాన్ని తెల్ల‌గా, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి మంద‌పాటి గిన్నెను పెట్టుకుని ఒక క‌ప్పు సన్ ఫ్లవర్ ఆయిల్ ను వేయాలి.

ఆయిల్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల ల‌వంగాలు వేసి చిన్న మంట‌పై రెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ త‌ర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు వేసి ఆయిల్‌ను బాగా మ‌రిగించాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి స్ట్రైన‌ర్ సాయంతో ఆయిల్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇలా స‌ప‌రేట్ చేసి పెట్టుకున్న ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక‌.అప్పుడు అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్‌ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే.సీర‌మ్ సిద్ధం అవుతుంది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

ఈ సీర‌మ్‌ను ఒక బాటిల్‌లో నింపి ఫిడ్జ్‌లో స్ట్రోర్ చేసుకోవాలి.ప్ర‌తి రోజు ఉద‌యం స్నానం చేయ‌డానికి గంట ముందు మ‌రియు రాత్రి నిద్ర‌పోవ‌డానికి ముందు త‌యారు చేసుకున్న సీర‌మ్‌ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మ‌సాజ్‌ చేసుకోవాలి.

Advertisement

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఏర్ప‌డ్డ మ‌చ్చ‌లు క్ర‌మంగా తొల‌గిపొయి.ముఖం వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

తాజా వార్తలు