మీ పిల్ల‌ల ఎత్తును పెంచే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్ ఇదే!

నేటి ఆధునిక కాలంలో చాలా మంది పిల్లలు వయసుకు తగ్గ‌ ఎత్తు ఉండటం లేదు.

పౌష్టికాహార లోపం, తల్లిదండ్రుల జీన్స్, జీవన శైలిలో మార్పులు, శారీరక ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల హైట్ పెర‌గ‌డం ఆగిపోతుంటుంది.

దాంతో త‌మ పిల్లలు ఎత్తు పెరగడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ.వారిని హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిప్పుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ డ్రింక్‌ను త‌యారు చేసి మీ పిల్ల‌లకు ఇస్తే.వారు స‌హ‌జంగానే ఎత్తు పెరుగుతారు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక క‌ప్పు న‌ల్ల నువ్వులు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న నువ్వుల‌ను చ‌ల్లార‌బెట్టుకుని.

ఆపై మిక్సీ జార్‌లో మెత్త‌టి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ నువ్వుల పొడిని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గుమ్మ‌డి గింజ‌లు, నాలుగు బాదం ప‌ప్పులు వేసి వాట‌ర్‌తో ఒక‌సారి వాష్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో ఒక చిన్న క‌ప్పు వాట‌ర్ పోసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉదయ‌న్నే మిక్సీ జార్‌లో నాన‌బెట్టుకున్న గుమ్మ‌డి గింజ‌లు, బాదం ప‌ప్పుల‌ను వార‌ట్‌తో స‌హా మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ పాలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న‌ గుమ్మ‌డి గింజ‌లు-బాదం మిశ్ర‌మం, వ‌న్ టేబుల్ స్పూన్‌ నువ్వుల పొడి వేసి చిన్న మంట‌పై ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.చివ‌రిగా అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి.

నెయ్యిలో ఇవి క‌లిపి రాస్తే..వృద్ధాప్య ఛాయ‌లు దూరం

ఒక నిమిషం పాటు మ‌రిగిస్తే టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధం అయిన‌ట్లే.ఈ డ్రింక్‌ను ఒక గ్లాస్ చ‌ప్పున పిల్ల‌ల చేత ప్ర‌తి రోజు ఉద‌యాన్నే తాగించాలి.

Advertisement

త‌ద్వారా వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు.అలాగే వారి శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌క‌ల విలువ‌లు సైతం ఈ డ్రింక్ ద్వారా ల‌భిస్తాయి.

తాజా వార్తలు