బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించి గుండెను ఆరోగ్యంగా మార్చే సూప‌ర్ డ్రింక్ ఇదే!

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేకపోవ‌డం, ధూమపానం, మ‌ద్య‌పానం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే కొద్ది గుండెకు ముప్పు పెరుగుతుంటుంది.

అలాగే మ‌రెన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తుతాయి.అందుకే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించుకోవ‌డం ఎంతో ముఖ్యం.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ డ్రింక్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్ ఏంటో.

దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement
This Is A Super Drink That Dissolves Bad Cholesterol And Makes The Heart Healthi

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం త‌రుగు, వ‌న్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి త‌రుగు, నాలుగైదు నిమ్మ‌పండు ముక్క‌లు, అర అంగుళం దాల్చిన చెక్క వేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.ఇలా మ‌రిగించిన వాటిని కాస్త చ‌ల్లార‌బెట్టుకుని.

ఆపై బ్లెండ‌ర్ లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకుని.

అందులో రుచికి స‌రిప‌డా తేనెను క‌లుపుకోవాలి.త‌ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించే సూప‌ర్ డ్రింక్ సిద్ధం అవుతుంది.

This Is A Super Drink That Dissolves Bad Cholesterol And Makes The Heart Healthi

మార్నింగ్ టైమ్‌లో ఈ డ్రింక్‌ను తీసుకుంటే ర‌క్తంలో పేరుకు పోయిన చెడు కొల‌స్ట్రాల్ మొత్తం క్ర‌మంగా క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.అలాగే ఈ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ అవుతారు.బాడీ డిటాక్స్ అవుతుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బూస్ట్ అవుతుంది.జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

Advertisement

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ సూప‌ర్ డ్రింక్‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు