దీపావళి రోజు ఫేస్ డల్ గా ఉందా? వర్రీ వద్దు.. వెంటనే ఇలా చేయండి!

దీపావళి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఇష్టపడి చేసుకునే పండుగ.

అటువంటి పండుగ రోజు ముఖం డల్ గా ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్పక్కర్లేదు.ముఖ్యంగా మ‌గువ‌లైతే మరింత ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు.

అయితే డల్ స్కిన్ తో వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా పాటిస్తే దీపావళి రోజున దీపాల వెలుగు మధ్య మీ ముఖం అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మీడియం సైజ్ కీరా దోస‌కాయ‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా సన్నగా తురుముకోవాలి.

Advertisement
This Is A Simple Remedy To Prevent Dull Skin On Diwali , Simple Remedy, Dull Ski

ఈ తురుము నుంచి స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.అలాగే ఒక అలోవెరా ఆకును తీసుకుని వాటర్‌లో కడిగి లోపల ఉండే జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.

మరోవైపు ఒక కప్పు హాట్ వాటర్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో సపరేట్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్, కీరా జ్యూస్, గ్రీన్ టీ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ఐస్ ట్రేలో నింపుకుని మూడు లేదా నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.

This Is A Simple Remedy To Prevent Dull Skin On Diwali , Simple Remedy, Dull Ski

అనంతరం త‌యారైన‌ ఐస్ క్యూబ్స్ ను తీసుకుని ముఖంపై స్మూత్ గా రబ్ చేసుకోవాలి.ఆపై నార్మల్ వాటర్ తో క్లీన్ గా ముఖాన్ని వాష్‌ చేసుకోవాలి.ఇలా చేస్తే డల్ స్కిన్ క్షణాల్లో గ్లోయింగ్ గా మరియు షైనీగా మారుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే ఓపెన్ పోర్స్‌ ఏమైనా ఉంటే క్లోజ్ అవుతాయి.మరియు చర్మం టైట్ అండ్ బ్రైట్ గా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు