Hair Thickening Remedy: పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే పవర్ ఫుల్ రెమెడీ ఇది!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల కొందరి జుట్టు విపరీతంగా రాలిపోయి పల్చగా మారుతుంటుంది.

ప‌ల్చ‌ని జుట్టు వ‌ల్ల ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.

పైగా అందం కూడా త‌గ్గుతుంది.ఈ నేప‌థ్యంలోనే పల్చని జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.

చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూలను వాడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ హోమ్ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారడం ఖాయం.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ ను పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ పౌడర్ వేసుకుని పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.అనంతరం స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ వాటర్ ను స్ప్రే చేసుకోవాలి.

ఆపై కనీసం ప‌ది నిమిషాలు అయినా కుదుళ్ళను మసాజ్ చేసుకోవాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

వారంలో రెండు సార్లు ఈ విధంగా గనుక చేస్తే పల్చటి జుట్టు మళ్ళీ ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.

Advertisement

మరియు జుట్టు షైనీ గా సైతం మారుతుంది.