బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన డ్రింక్ ఇదే!

అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నామ‌ని చెప్పే వారి సంఖ్య‌ ఇటీవ‌ల కాలంలో అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.అయితే బ‌రువు పెర‌గ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్న‌ట్లే.

త‌గ్గ‌డానికి కూడా అనేక మార్గాలు ఉంటాయి.స‌రైన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే చాలా సుల‌భంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

మీరు కూడా బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్ ను మీరు తీసుకోవాల్సిందే.మ‌రి ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అస‌లు ఆ డ్రింక్‌ను ఎందుకు తీసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి వేయించుకోవాలి.

అలాగే వ‌న్‌ టేబుల్ స్పూన్ గుమ్మ‌డి గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, నాలుగు బాదం ప‌ప్పుల‌ను కూడా వేయించి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో వేయించుకున్న ఓట్స్‌, వేయించిన గుమ్మ‌డి గింజ‌లు, అవిసె గింజ‌లు, బాదం ప‌ప్పులు, హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పీన‌ట్ బ‌ట‌ర్‌, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, ఒక గ్లాస్ సోయా పాలు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే.

Advertisement
This Is A Must Have Drink For Those Who Want To Lose Weight! High Protein Weight

హై ప్రోటీన్ వెయిట్ లాస్ డ్రింక్ సిద్ధం అవుతుంది.

This Is A Must Have Drink For Those Who Want To Lose Weight High Protein Weight

ఈ డ్రింక్ ను రోజూ ఉద‌యం పూట తీసుకుంటే అతి ఆక‌లి దూరమ‌వుతుంది.చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.

దాంతో వేగంగా బ‌రువు త‌గ్గుతారు.అంతేకాదు, పైన చెప్పిన హై ప్రోటీన్ డ్రింక్ ను తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి.ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగ్గా మారి.గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు