తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ కృష్ణవంశీ( Krishnavamsi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ( Rangamarthanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ వంటి వారు ఎంతో అద్భుతంగా నటించారు.
ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మార్చి 22వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం( Brahmanandam ) పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.దాదాపు 1200 సినిమాలలో కమెడియన్ గా నటించిన బ్రహ్మానందం ఈ సినిమాలో సరికొత్తకోణంలో నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేశారు.
అయితే తాజాగా ఈ సినిమా గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.మరాఠీ చిత్రం నన్నా సినిమా చూసినటువంటి ప్రకాష్ రాజ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో సహాయం చేయాలని కోరారు.
ఈ సినిమా చూసిన తర్వాత నాలాంటి రాక్షసుడు తోనే కంటతడి పెట్టించిన చిత్రం ఇది.ఇందులో నాకు తోచిన విధంగా మార్పులు చేసి ప్రకాష్ రాజ్ కు ఇవ్వగా ఈ సినిమాకు నన్ను దర్శకత్వం వహించమన్నారు.ఇక ఈ సినిమాకు తాను డైరెక్టర్గా మారిపోయానని తెలిపారు.
ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం గారి నటన అద్భుతం అని చెప్పాలి ఈయన ఇన్ని సినిమాలలో చేసినా కూడా ఒక్కో సీన్ కు 20 టేకులు చెప్పిన ఓపికగా చేసేవారని ఈ సందర్భంగా కృష్ణవంశీ వెల్లడించారు.ఇక ఇందులో ప్రతి ఒక్కరి నటన ఈ సినిమాకు మెగాస్టార్ గారి వాయిస్ ఓవర్ కూడా ప్లస్ అయిందని ఈ సందర్భంగా రంగమార్తాండ సినిమా గురించి కృష్ణవంశీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy