చుండ్రు, తల దురదను మాయం చేసే మ్యాజికల్ రెమెడీ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే చాలు!

మనలో చాలా మందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది.తలలో చుండ్రు( Dandruff ) ఉంటే దురద కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే చుండ్రు, తల దురద సమస్యలను వదిలించుకునేందుకు తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.ఖరీదైన షాంపూ వాడుతుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే చాలా సులభంగా చుండ్రు మరియు తల దురద సమస్యలు మాయం అవుతాయి.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

This Is A Magical Remedy For Dandruff And Itchy Scalp Dandruff, Itchy Scalp, Ma
Advertisement
This Is A Magical Remedy For Dandruff And Itchy Scalp! Dandruff, Itchy Scalp, Ma

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే రెండు స్పూన్లు గ్రీన్ టీ ఆకులు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత గ్రీన్ టీ ని ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

గోరువెచ్చగా అయిన త‌ర్వాత‌ తయారు చేసుకున్న గ్రీన్ టీ( Green tea ) లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) మరియు రెండు లేదా మూడు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

This Is A Magical Remedy For Dandruff And Itchy Scalp Dandruff, Itchy Scalp, Ma

త‌ద్వారా మంచి హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఆ తరువాత స్కాల్ప్ ను కనీసం ప‌ది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Advertisement

ఈ హెయిర్ టోనర్ ను ఒక్కసారి ట్రై చేసిన చాలు మంచి రిజల్ట్ ను మీరు గమనిస్తారు.ఈ హోమ్ మేడ్ టోనర్ స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది.

చుండ్రు సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది.తల దురదను దూరం చేస్తుంది.

కాబట్టి చుండ్రు, తల దురద సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకునే వాడెందుకు ప్రయత్నించండి.పైగా ఈ టోన‌ర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.

హెయిర్ ఫాల్ కు సైతం అడ్డుకట్ట వేస్తుంది.

తాజా వార్తలు