ఈ హోం మేడ్ మ‌ల్టీవిట‌మిన్ డ్రింక్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యం ప‌దిల‌మే!

ఆరోగ్యంగా, ఫిట్‌గా జీవించాల‌న్నా.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాల‌న్నా.

మ‌న శ‌రీరానికి అన్ని ర‌కాల విట‌మిన్స్‌ను అందించాలి.

ఈ నేప‌థ్యంలోనే చాలా మంది మ‌ల్టీవిట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటుంటారు.

అయితే సహజ సిద్ధంగా లభించే పోషకాలతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం వేరు.ట్యాబ్లెట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం వేరు.

వీలైనంత వ‌ర‌కు సమతుల్య ఆహారంతోనే శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోష‌కాల‌ను అందించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే హోం మేడ్ మ‌ల్టీవిట‌మిన్ డ్రింక్‌ను డైట్ లో గ‌నుక చేర్చుకుంటే మీ ఆరోగ్యం ప‌దిల‌మే.

Advertisement

మ‌రి లేటెందుకు ఆ మ‌ల్టీవిట‌మిన్ డ్రింక్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొల‌గించి.

లోప‌ల ఉండే గింజ‌ల‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక ఆరెంజ్ పండును కూడా తీసుకుని.లోప‌ల ఉండే ప‌ల్ప్‌ను వేరు చేయాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, దానిమ్మ గింజ‌లు, ఆరెంజ్ ప‌ల్ప్‌, చిటికెడు పింక్ సాల్ట్‌, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీల‌క‌ర్ర పొడి, గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

చివ‌రిగా అందులో వ‌న్ టేబుల్ స్పూన్ నాన‌బెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేస్తే హెల్తీ అండ్ టేస్టీ హోం మేడ్ మ‌ల్టీవిట‌మిన్ డ్రింక్ సిద్ధం అయిన‌ట్లే.ఈ డ్రింక్ ను ఒక గ్లాస్ చ‌ప్పున ప్ర‌తి రోజు తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్‌గా మారుతుంది.సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, ర‌క్త‌హీన‌త వంటి వ్యాధులు వ‌చ్చే రిస్క్ సైతం త‌గ్గుతుంది.

కాబ‌ట్టి, ఈ హోం మేడ్ మ‌ల్టీవిట‌మిన్ డ్రింక్ త‌ప్ప‌కుండా డైట్‌లో చేర్చుకోండి.

తాజా వార్తలు