ఎండోమెంట్ ఆధీనంలోకి ఈ అయ్యప్ప దేవాలయం.. ఎక్కడంటే..?

అయ్యప్ప స్వామి దేవాలయం( Ayyappa Swamy Temple ) రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధికి వెళ్లిందని స్థానిక పండితులు చెబుతున్నారు.

అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ( Endowment Department )అధికారులు ఆదేశాలతో చేవెళ్లలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్నా అయ్యప్ప స్వామి దేవాలయన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది.

ఇంకా చెప్పాలంటే నవంబర్ నెలలోనే ఈ దేవాలయాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.దేవాలయ స్థలంలో 2007లో భక్తులు, దాతలు, ప్రజాప్రతినిధుల సహాయంతో అయ్యప్ప దేవాలయాన్ని శబరిమలైలో గల దేవాలయ నమూనాలో నిర్మించారు.

అప్పటి నుంచి దేవాలయ నిర్వహణ భక్తులే కొనసాగిస్తూ ఉన్నారు.రోజు దేవయానికి వందలాది భక్తులు వస్తూ ఉంటారు.అలాగే పండుగ రోజుల్లో అయ్యప్ప మాలధారణ సమయాలలో భారీ గా భక్తులు తరలివస్తుంటారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ దేవాలయం నిర్వహణను ప్రభుత్వం తీసుకుంది.దీంతో భక్తులు, చెవెళ్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

Advertisement

ఇప్పటి నుంచి పూజారి, సిబ్బంది వేతనం ఎండోమెంట్ శాఖ ఇస్తుందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.అలాగే వచ్చే ఆదాయాన్ని సైతం ప్రభుత్వ ఖజాన లో జమ చేస్తుంది.

అలాగే అధికారులు దేవాలయంలో ఉన్న హుండీకి సీలు వేశారు.ఇంకా చెప్పాలంటే చేవెళ్ల అయ్యప్ప స్వామి దేవాలయ 16వ వార్షికోత్సవాలు( 16th Anniversaries ) ఈ నెల తొమ్మిదవ తేదీన సాయంత్రం వరకు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించలని పండితులు చెబుతున్నారు.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.అలాగే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024
Advertisement

తాజా వార్తలు