నాన్న.. నాకు శృతిహాసన్ కావాలి అంటున్న హీరో

బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఏది అసాధ్యం కాదు అని చెప్పడానికి పెద్ద ఉదాహరణగా బెల్లంకొండ శ్రీనివాస్ ని చెప్పుకోవచ్చు.

మొదటి సినిమా "అల్లుడు శీను"కి వివి వినాయక్ దర్శకుడు, ఏకంగా సమంత హీరోయిన్, దేవిశ్రీప్రసాద్ సంగీతం .

అదీ కాకుండా తమన్నాతో ఐటమ్ సాంగ్.రెండొవ సినిమా స్పీడున్నోడులో పెద్ద హీరోయిన్ ని ట్రై చేయలేదు కాని, అందులో కూడా తమన్నాతో ఆడిపాడించారు.

ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయినా, బోయపాటితో సినిమా కుదుర్చుకున్నారు.ఇక్కడ రకుల్ ప్రీత్ హీరోయిన్.అసలు ఎక్కడ తగ్గట్లేదు కదా! తగ్గే ఛాన్స్ కూడా లేదు.

బోయపాటి సినిమా అయిపోగానే డిక్టేటర్ దర్శకుడు శ్రీవాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట.ఆ సినిమాలో కూడా టాప్ హీరోయిన్ కావాల్సిందే.

Advertisement

ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు.దక్షిణాదిన కథానాయికలు కనివినని రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా సమస్య కాదు .ఏది ఏమైనా సరే, తన తదుపరి సినిమాకి మాత్రం శృతి హాసన్ హీరోయిన్ గా కావాల్సిందే అని బెల్లంకొండ శ్రీనివాస్ తన తండ్రి బెల్లంకొండ సురేష్ ని అడుగుతున్నాడట.శృతి కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారట.

మరి శృతి వీళ్ళ ఆఫర్ కి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు