మహరాష్ట్రలో దారుణం.. షిరిడి వెళ్లి వస్తున్న భక్తులపై.. ?

మహరాష్ట్రలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.సంతోషంగా షిరిడి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం పై దొంగలు దాడికి పాల్పడినారట.

ఈ ఘటన తాలూకూ వివరాలు తెలుసుకుంటే.వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవేల్కిచర్ల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కె.రాములు, మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి రమేష్ మొదలగు వీరి కుటుంబం సాయినాధుని దర్శనం చేసుకుని షిరిడి నుండి తమ స్వగ్రామానికి వస్తున్న క్రమంలో, కర్ణాటక, వాసీ పోలీస్టేషన్ పరిధిలో కొందరు దుండగులు వీరి వాహనాన్ని అడ్దగించే ప్రయత్నం చేసినారట.అయితే వారి చేతిలో కత్తులను చూసిన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో, అదుపు తప్పిన ఆ వాహనం, బోల్తాపడ్డదట.

దీంతో ఆ దొంగలు విచక్షణరహితంగా చిన్న పిల్లలను మహిళలను గాయపరచి వారి దగ్గర ఉన్న 8 తులాల బంగారంతో పాటుగా నగదును కూడా ఎత్తు కెళ్లారట.ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను...స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు