51 ఏళ్ల వయస్సులో పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరో ప్రశాంత్.. అసలేం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నవి కామన్.

ఎప్పటినుంచో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు( Celebrities ) ఆ తర్వాత కొంతకాలానికి ఊహించని విధంగా తీసుకుని విడిపోయిన వారు చాలామంది ఉన్నారు.

ఇంకొంతమంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోయిన వారు కూడా ఉన్నారు.ఇప్పటికీ నాలుగు పదుల వయసు ఐదు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న సెలెబ్రటీలు చాలామంది ఉన్నారు.

ఇంకొంత మంది సెలబ్రిటీలు లేటు వయసులో కూడా రెండో పెళ్లికి సిద్ధపడుతూ ఉంటారు.

Thiagarajan Confirms Prashanth Get Married Second Time, Prashanth, Kollywood, Ma

అలా తాజాగా కూడా కోలీవుడ్‌ హీరో ప్రశాంత్‌ ( Kollywood hero Prashanth )రెండోసారి పెళ్లిపీటలెక్కనున్నాడు.51 ఏళ్ల వయసున్న ఈయన త్వరలోనే మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.ఈ విషయాన్ని ఆయన తండ్రి, దర్శకుడు త్యాగరాజన్‌( Thyagarajan ) వెల్లడించాడు.

Advertisement
Thiagarajan Confirms Prashanth Get Married Second Time, Prashanth, Kollywood, Ma

తాజాగా అంధగన్‌ సినిమా( Andhagan movie ) సక్సెస్‌ మీట్‌లో త్యాగరాజన్‌.ప్రశాంత్‌ పెళ్లి గురించి మాట్లాడాడు.

వధువు గురించి వెతుకులాట మొదలు పెట్టామని, త్వరలో గుడ్‌న్యూస్‌ చెబుతామని తెలిపారు.ఈ మాటలతో స్టేజీపై ఉన్న ప్రశాంత్‌ కాస్త సిగ్గుపడినట్లు కనిపించాడు.

కాగా 2005లో ప్రశాంత్‌కు గృహలక్ష్మి అనే మహిళతో పెళ్లి జరిగింది.కానీ ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు.

Thiagarajan Confirms Prashanth Get Married Second Time, Prashanth, Kollywood, Ma

2009లో వీరు విడాకులు తీసుకున్నారు.నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు.అప్పటినుంచి ఈయన సింగిల్‌ గానే ఉంటున్నాడు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

కెరీర్‌ పైనే పూర్తి ఫోకస్‌ పెట్టిన ప్రశాంత్‌ ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు.ఇకపోతే ప్రశాంత్ సినిమాల విషయానికి వస్తే.

Advertisement

తెలుగులో లాఠి, ప్రేమ శిఖరం, తొలి ముద్దు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.అలాగే రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు.

తాజా వార్తలు