బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రతి వారం రెండు రోజులపాటు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని జంటల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా సుడిగాలి సుదీర్,రష్మీ మధ్య ఇలాంటి లవ్ ట్రాక్ క్రియేట్ చేసి ఈ కార్యక్రమానికి భారీ హైప్ క్రియేట్ చేశారు.
సుడిగాలి సుదీర్ రష్మి తో పాటు వర్ష ,ఇమ్మానియేల్,రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత వంటి పలువురు మధ్య ఇలాంటి లవ్ ట్రాక్ సన్నివేషాలను క్రియేట్ చేశారు.ఈ విధంగా కొన్ని సార్లు వీరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు చూస్తే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహం కలగక మానదు.
అయితే ఇప్పటికి ఈ జంటల మధ్య ఉన్న లవ్ ట్రాక్ గురించి తరచూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో కూడా వర్ష ఇమ్మానుయేల్ గురించి ఇలాంటి ఎమోషనల్ కామెంట్ చేయడం గమనార్హం.
అయితే ఈ విధంగా ఈ కార్యక్రమాలలో లవ్ ట్రాక్ రావడానికి ప్రధాన కారణం ఎవరో గెటప్ శ్రీను చెప్పకనే చెప్పేశారు.
తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో భాగంగా వర్ష ఇమ్మానియేల్ గురించి మాట్లాడుతూ తను కాదన్న రోజు తన ప్రాణం పోతుందని చెబుతుంది.ఆ సమయంలోనే బ్యాక్ గ్రౌండ్ లవ్ సాంగ్ వేస్తారు.ఈ క్రమంలోనే గెటప్ శీను డిజె అతని దగ్గరకు వెళ్లి ఇలాంటి లవ్ సాంగ్స్ ఎవరు వేయమన్నారు.
మీరు ఇలాంటివి ప్లే చేయటం వల్ల ఆడియన్స్ వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని అనుకుంటారు.ఇలాంటి పాటలు వల్ల వారి మధ్య ప్రేమ లేకపోయినప్పటికీ పుట్టిస్తున్నారు అంటూ కౌంటర్ వేశారు.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో లవ్ ట్రాక్స్ క్రియేట్ కావడానికి కారణాన్ని ఈ సందర్భంగా గెటప్ శ్రీను బయటపెట్టారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy