మునుగోడులో ఇప్ప‌టి వ‌ర‌కు వాళ్లే ఎమ్మెల్యేలు.. ఏ సామాజిక వ‌ర్గం ఎంతంటే..?

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.ప్ర‌ధాన పార్టీలు అన్నీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి.

సామాజిక వ‌ర్గం ఎంతుంది.ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే దానిపై లెక్క‌లేసుకుంటున్నాయి.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే.ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అక్క‌డ ఏ మాత్రం బలం లేని బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు.

అధికార టీఆర్ఎస్ గతంలో ఓసారి ప్రాతినిథ్యం వహించినప్పటికీ వర్గ రాజకీయాలతో సతమతం అవుతోంది.అక్కడ ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడికి మరోసారి టిక్కెట్ ఇవ్వనున్నట్లు కథనాలు రావడంతో అసమ్మతి వర్గం అడ్డం తిరుగుతోంది.

Advertisement

ఇక కాంగ్రెస్ మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ సారథ్యంలో తనదైన శైలిలో కార్యక్రమాలు చేసుకుపోతోంది.రేవంత్ స్వయంగా రెండు మండలాల్లో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

అయితే గ‌తంలో ఎప్పుడూ కూడా బీసీల‌కు టికెట్ ఇచ్చిన దాఖ‌ళాలు లేవు.ఇప్పుడు ఇదే హైలైట్ కానుంది.

కాంగ్రెస్ బీసీ నేత‌కే టికెట్ ఇవ్వ‌ల‌ని చూస్తోంది.మునుగోడు ఎమ్మెల్యేగా 1967 లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సీపీఐ నుంచి పోటీ చేసిన ఉజ్జిని నారాయణరావుపై గెలిచారు.1978లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కంచర్ల రామకృష్ణారెడ్డి జ‌న‌తా పార్టీ పై గెలిచారు.1983లో బొమ్మగాని ధర్మబిక్షంపై గెలిచారు.1985లో ఉజ్జీని నారాయణ రావు మునగాల నారాయణరావుపై గెలిచారు.ఇక 1989లో ఉజ్జినీ నారాయణ రావు పాల్వాయి గోవర్దన్ రెడ్డిపై గెలిచారు.1994లో నారాయ‌ణ‌రావు పాల్వాయి గోవర్దన్ రెడ్డి పై గెలిచారు.1999లో పాల్వాయి గోవర్దన్ రెడ్డి జేల్లా మార్కండేయ టీడీపీపై గెలిచారు.2004లో పల్లా వెంకట్ రెడ్డి సీపీఐ కాశీనాథ్ టీడీపై గెలిచారు.2009లో ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ పాల్వాయి గోవర్దన్ రెడ్డిపై గెలిచారు.ఇక 2014లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆరెస్.

పాల్వాయి స్రవంతిపై గెలిచారు.అలాగే 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై విజ‌యం సాధించారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఏ వ‌ర్గం ఎంతంటే.

మునుగోడు గ్రామీణ నియోజకర్గం.అందులోనూ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల కంటే బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గమని చెబుతారు.

Advertisement

సామాజిక వర్గాల వారీగా చూస్తే.మునుగోడులో గౌడ్ లు అత్యధికంగా 36 వేల మంది ఉన్నారు.

ఆ తర్వాత ముదిరాజ్ లు 34 వేలు మాదిగలు 26 వేలు యాదవులు 22 వేలు మాలలు 12 వేలు గిరిజనులు 11 వేలు ఉన్నారు.వీరంతా పదివేల సంఖ్య పైబడి ఉన్నారు.

ఇక పది వేలలోపున వడ్డెరలు 9 వేలు, కుమ్మరులు 9వేలు, విశ్వబ్రాహ్మణులు 9 వేలు, ముస్లింలు దాదాపు 10 వేల వ‌ర‌కు ఉన్నారు.అయితే అత్యధిక సార్లు మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా దాదాపు ప‌ది వేలు ఉన్నారు.

ఇక కమ్మ సామాజిక వర్గం వారు ఏడు వేలు, ఆర్య వైశ్య మున్నూరు కాపు వెలమ వంటి కులాల వారు 4 వేల చొప్పున ఉన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలవే రెండు ల‌క్ష‌లు.

మునుగోడులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్లు దాదాపుగా రెండు ల‌క్ష‌లు ఉన్నారు.ఓసీల‌వి 25 వేల ఓట్లున్నాయి.

అయితే ఇక్కడి నుంచి 1990ల్లో బీసీ అభ్యర్థులు ఎవరికీ పోటీకి అవకాశం చిక్కలేదు.రెడ్డి వెలమ నాయకత్వమే అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచింది.

ఇక తెలంగాణ ఇంటి పార్టీ పేరిట పార్టీ స్థాపించిన ఉద్యమకారుడు ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చెరుకు సుధాకర్ తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వంటివారు మునుగోడు నియోజకర్గం వారు కావడం గమనార్హం.వీరిని కూడా పార్టీలు స్ట‌డీ చేస్తున్నాయి.

అయితే బీసీ సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉన్నా త‌మ కులం అభ్య‌ర్థికే ఓటు వేస్తార‌న్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే గ‌తంలో త‌క్క‌వ సంఖ్య గ‌ల సామాజిక వ‌ర్గం నేత‌లే పాలించారు గ‌నుక‌.

మ‌రి ఉప ఎన్నిక బ‌రిలో పార్టీలు ఏ సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు