టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కు ప్రముఖ మ్యాగజైన్ ద వీక్ క్షమాపణ చెప్పింది.నవంబర్ 17న ఈ మ్యాగజైన్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
ఫ్రీ లంచ్ పేరుతో ప్రచురితమైన ఆ కథనంలో లోకేష్‌పై ఆ మ్యాగజైన్ నిరాధార ఆరోపణలు చేసింది.2017 నుంచి 2019 వరకూ విశాఖ ఎయిర్‌పోర్టులో కేవలం స్నాక్స్ పేరు చెప్పి రూ.15 లక్షల బిల్లు చేశారని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ది వీక్ చెప్పింది.అయితే ఈ బిల్లు మొత్తం కేవలం అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్, ఆయన టీమ్ చేసిందే అన్నట్లుగా ఆ మ్యాగజైన్ ఆరోపించింది.
కానీ ఈ రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వేలాది మంది ప్రొటోకాల్ గెస్ట్‌ల కోసం అందించిన స్నాక్స్‌కు ఇంత మొత్తం అయినట్లు ది వీక్ ఇప్పుడు చెబుతోంది.దీనికి సంబంధించిన ఆధారాలను లోకేష్ కార్యాలయం తమకు అందించినట్లు ఆ మ్యాగజైన్ ఓ వివరణను ప్రచురించింది.
లోకేష్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ ఇలాంటి తప్పుడు కథనాన్ని ప్రచురించినందుకు క్షమాపణ కోరింది.నిజానికి ఈ అంశాన్ని వైసీపీ వాళ్లు కూడా బాగానే వాడుకున్నారు.చినబాబు చిరుతిండికి లక్షలు ఖర్చయ్యాయంటూ జగన్ పత్రిక కూడా అప్పట్లో ఓ కథనం రాసింది.
దీనిపై టీడీపీ వాళ్లు వివరణ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy