ఈ రాశుల వారు మొండిఘటలు.. వీరితో అస్సలు వాదించలేరు..!

ప్రస్తుత జీవితంలో చాలా రకాల వ్యక్తులను చూస్తూ ఉంటాం.అందులో ఏ ఇద్దరి ప్రవర్తన ఒకే విధంగా ఉండదు.

కొందరు మృధుస్వభావంతో ఉంటారు.మరికొందరు పౌరుషంగా మాట్లాడుతూ ఉంటారు.

ఇంకొందరు సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.వారు పుట్టిన నక్షత్రం,రాశి గ్రహ సంచారం ఆధారంగానే ఇలా ప్రవర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు.

అయితే కొన్ని రాశుల వారు మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు.ఎంతసేపు వాళ్ళు చెప్పిందే కానీ ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన అస్సలు కన్విన్స్ కారు.

Advertisement

అలాంటి రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి ( Aries )వారు ఎంతో తెలివైన వారు.తమకు తెలియనిది లేదనే గర్వం వీరిలో కాస్త ఉంటుంది.

అలాగే వారు చెప్పినదే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు.ఎవరైనా తము చెప్పిన దానికి అడ్డం వస్తే అసలు భరించలేరు.ఇంకా చెప్పాలంటే సింహ రాశి( Leo ) వారు స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు.

వారికి ఏదైనా నచ్చకపోతే అక్కడితో అస్సలు వదలరు.వాదనకు దిగుతారు.

ఎదుటివారు చెప్పింది అసలు వినరు.తమను చులకన చేస్తున్నారనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అందుకే వాదిస్తారు.కానీ వెనక్కి తగ్గరు.

Advertisement

ఇంకా చెప్పాలంటే తుల రాశి( Libra ) వారు నిశ్చల స్వభావం కలిగి ఉంటారు.వీరు తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు.

అలాగే ఇతరుల గురించి కూడా బాగా ఆలోచిస్తారు.ఇంతవరకు బాగానే ఉన్నా కోపం వచ్చిందంటే చాలు వీళ్లు వాస్తవ సుభావాన్ని కోల్పోతారు.

ఎదుటి వ్యక్తి తమ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచన లేకుండా వాదన ప్రారంభిస్తారు.

ఇంకా చెప్పాలంటే కుంభ రాశి( Aquarius ) వారు తమ జీవితంలో చాలా కష్టపడి పని చేస్తారు.కుంభ రాశి వారు మాత్రం ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా గౌరవ మర్యాదలను పొందుతారు.వాళ్ళ కష్టాలకు తగిన ప్రతిఫలం పొందడమే కాకుండా పరువు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటారు.

అందుకే వీరిలో కొంచెం ఆధిపత్య భావన ఉంటుంది.అందుకే అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ మాటలను వ్యతిరేకరిస్తే అస్సలు అంగీకరించరు.

ఈ రాశి వారు కోపంగా ఉన్నప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకోరు.కానీ కోపం తగ్గాక మాత్రం ఏది తప్పు ఏది కరెక్ట్ అనే విషయాన్ని తెలుసుకుంటారు.

తాజా వార్తలు