ఈ రెండు పదార్థాలతోనే జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు.. తెలుసా?

పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల కొందరు జుట్టు చాలా అంటే చాలా పలుచగా మారిపోతుంటుంది.

జుట్టు పల్చగా ఉంటే ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేరు.

ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే కేవలం రెండే రెండు పదార్థాలతో సుల‌భంగా పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.మెంతులు.

వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రతి ఒక్కరి వంటింటి పోపుల పెట్టె లో ఉండే మెంతులు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.

Advertisement

అవి మన ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే ఉల్లిపాయ కూడా జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఈ రెండిటిని ఉపయోగించే పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఒక గ్లాస్‌ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు మరియు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివ‌ర్ల వరకు పట్టించి ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే కనుక జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు సమస్య కూడా దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు