స‌మ్మ‌ర్ లో బాడీ హీట్‌ను మాయం చేస్తే సూప‌ర్ డ్రింక్స్ మీకోసం!

అస‌లే వేస‌వికాలం.( Summer ) ఈ సీజ‌న్ లో ఇంట్లో ఎవ‌రో ఒక‌రు ఒంట్లో వేడెక్కువైంద‌ని( Body Heat ) అంటుంటారు.

తలనొప్పి, నీరసం, అలసట, తీవ్రమైన దాహం, ఎసిడిటీ, మలబద్ధకం, నిద్రలేమి, ఆక‌లి లేకపోవ‌డం, మూత్రంలో మార్పులు, అధికంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఒంట్లో వేడి ఎక్కువైన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు.అయితే ఈ ల‌క్ష‌ణాల‌కు చెక్ పెట్టి ఒంట్లో వేడిని హ‌రించే సూప‌ర్ డ్రింక్స్ కొన్ని ఉన్నాయి.

లేట్ చేయ‌కుండా వాటిపై ఓ లుక్కేసేయండి.బెల్లం నిమ్మ‌నీరు వేడిని దూరం చేసి బాడీకి కూలింగ్ ఎఫెక్ట్‌ను అందించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అందుకోసం ఒక గ్లాస్ గోరువెచ్చని వాట‌ర్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి,( Jaggery Powder ) రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ ర‌సం( Lemon ) క‌లిపారంటే మ‌న డ్రింక్ రెడీ అయిన‌ట్లే.ఈ డ్రింక్ బాడీ హీట్ ను త‌గ్గిస్తుంది.

Advertisement

అదేస‌మ‌యంలో శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని చేకూరుస్తుంది.

లెమ‌న్ మింట్ టీ( Lemon Mint Tea ) కూడా ఒంట్లో వేడిని త‌గ్గించ‌డానికి హెల్ప్ చేస్తుంది.అందుకోసం ఒక‌టిన్న‌ర్ గ్లాస్ వాట‌ర్ ను బాగా మ‌రిగించాలి.ఈ మ‌రిగించిన వాట‌ర్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్‌, నాలుగైదు పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేసి అర‌గంట పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఆపై టీను ఫ్లిట‌ర్ చేసుకుని అందులో రుచికి స‌రిప‌డా తేనె, కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని తాగేడ‌మే.ఈ లెమ‌న్ మింట్ టీ శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది.

అలాగే ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

వేస‌విలో ఒంట్లో వేడిని హ‌రించే మ‌రో సూప‌ర్ డ్రింక్ బ‌ట‌ర్ మిల్క్‌. ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, ఇంగువ కలిపి తాగితే శరీర వేడి తగ్గుతుంది మరియు జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.సహజమైన ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల ఒంట్లో వేడిని మాయం చేయ‌డంలో కొబ్బ‌రి నీళ్లు కూడా చాలా బాగా ఉపయోగపడ‌తాయి.

Advertisement

తాజా వార్తలు