ఎండాకాలంలో ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి..!

సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎండలు భారీగా పెరిగిపోయాయి.ఇప్పుడే పరిస్థితి ఇలాగ ఉంటే రానున్న రోజులలో ఉష్ణోగ్రత ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎండాకాలంలో ఎక్కువ మంది వడదెబ్బకు గురై వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలాంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు.కొందరు అదే పనిగా ఎండలో తిరుగుతూ వడదెబ్బకు గురవుతూ ఉంటారు.

కొన్నిసార్లు వడదెబ్బ ప్రాణాలను సైతం తీసేస్తుంది.అందుకే ముందస్తుగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది.

Advertisement

మనిషి సహజంగా రోజుకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల నీళ్లు తాగాలి.నీరసంగా ఉంటే కొబ్బరి నీరు కూడా తాగడం మంచిది.

అంతేకాకుండా నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీరు తాగడం కూడా ఎంతో మంచిది.ఎండలో బయటకు వెళితే మాత్రం తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి.

దీనితో పాటు మంచినీళ్ల బాటిల్ తలకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.ఎండలో ప్రయాణించే వారు గొడుగు,హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

అలాగే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు ఉండేలా చూసుకోవడం మంచిది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

మజ్జిగ అన్నం తీసుకోవడం, అలాగే పల్చని మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగడం మంచిది.ఇది పిల్లల, పెద్దల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఏసీలు, కూలర్లకు బదులుగా ఇంటితెరలను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

Advertisement

అలాగే ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.కనీసం రోజుకు నాలుగు లీటర్ల మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆహారంలో తగినంత ఉప్పు, నీరు కచ్చితంగా ఉండాలి.ఎండలో బయటకు వెళ్లేవారు కళ్లద్దాలను అందుబాటులో ఉంచుకోవడం మంచిది.బయటకు వెళ్లాలంటే ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే బయటికి వెళ్లడం మంచిది.

ఈ వేసవిలో ముఖ్యంగా చిన్నపిల్లల పై, 50 సంవత్సరాల వయసు దాటిన వారి పై ఎండ ప్రభావం పడకుండా జాగ్రత్త పడటం ఎంతో మంచిది.

తాజా వార్తలు