ఈ మొక్క‌లు ఇంట్లో ఉంటే షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌..తెలుసా?

`నాకు షుగ‌ర్ ఉందండీ.అని చెబుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగి పోతోంది.

దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన షుగ‌ర్(మ‌ధుమేహం) వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కాదు.ప్ర‌స్తుత రోజుల్లో పాతిక‌, ముప్పై ఏళ్ల వారిలో సైతం చాలా కామ‌న్‌గా క‌నిపిస్తోంది.

కార‌ణం ఏమైన‌ప్ప‌టికీ ఒక్క సారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే జీవిత కాలంలో మందు వాడాలి.అదే స‌మ‌యంలో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

పొర‌పాటున‌ కంట్రోల్ త‌ప్పాయా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అయితే మందులు ద్వారానే కాకుండా ఇంట్లో పెంచుకునే కొన్ని కొన్ని మొక్క‌ల ద్వారా కూడా షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు త‌ప్ప‌కుండా చేసుకోవ‌చ్చు.

Advertisement

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.క‌ల‌బంద.

దాదాపు అంద‌రి పెర‌టిలో ఉండే మొక్క ఇది.అయితే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు.క‌ల‌బంద ఎంతో మేలు చేస్తుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో స్పూన్ క‌ల‌బంద జెల్ క‌లుపుకుని సేవించాలి.ఇలా రోజూ ఉద‌యాన్నే చేస్తే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

మ‌రియు బ‌రువూ త‌గ్గుతారు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?

అలాగే క‌రివేపాకు మొక్క ఇంట్లో ఉన్నా షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు.అదెలా ఉంటే.ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఆరేడు క‌విపాకుల‌ను తీసుకుని బాగా న‌మిలి మింగాలి.

Advertisement

ఇలా చేస్తే ర‌క్తంలో అధిక చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

తిప్పతీగ మొక్క సైతం మ‌ధుమేహుల‌కు చాలా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.తిప్ప‌తీగ మొక్క మీ ఇంట్లో గ‌నుక ఉంటే.దాని ఆకుల‌ను నాలుగైదు తీసుకుని ఒక గ్లాస్ వాట‌ర్‌లో మ‌రిగించి.

ప‌ర‌గ‌డుపున తాగండి.ఇలా చేస్తే షుగ‌ర్ వ్యాధి ఎల్ల‌ప్పుడూ కంట్రోల్‌లోనే ఉంటుంది.

పైగా తిప్ప‌తీగ ఆకుల‌ను మ‌రిగిచిన వాట‌ర్ సేవిస్తే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.శ్వాసకోశ వ్యాధులు దూరం అవుతాయి.

మ‌రియు ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మానసిక స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

తాజా వార్తలు