దుర్గమ్మకు మూడోరోజు ఈ నైవేద్యం సమర్పిస్తే అన్నీ శుభాలే..!

దేవీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి.మూడో రోజు అయిన నేడు అమ్మవారు చంద్రఘంట దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.

అయితే ఈరోజున అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలని చాలా మంది అనుకుంటారు.కొబ్బరి అన్నం నేడు నైవేద్యంగా సమర్పిస్తే మంచి జరగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

నూనె, జీడిపప్పు, బుడ్డపప్పు, పోపు దినుసులు, తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మర్చిలు, కరివేపాకు, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన అన్నం, ఉప్పు.

తయారీ విధానం.

Advertisement

.ముందుగా అమ్మవారిని తలుచుకొని నైవేద్యం చేయడానికి వంట మదలు పెట్టాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒఖ ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి అందులో బుడ్డ పప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి.

ఆ తర్వాత పోపు దినుసులు వేసి పచ్చిమిర్చీలు తగినంత వేసుకొని బాగా వేగనివ్వాలి.ఆ తర్వాత కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి.తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసుకోవాలి.

అనంతరం ఉప్పు వేస్కొని బాగా కలుపుకోవాలి.ఇక కొబ్బరి అన్నం తయారైనట్లే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్6, బుధవారం2024

అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న కోరికలను కోరుకోవాల్సిందే.

Advertisement

తాజా వార్తలు