టాలీవుడ్ హీరోలను నిండా ముంచిన కోలీవుడ్ దర్శకులు వీళ్లే.. ఇన్ని ఫ్లాపులిచ్చారా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలు కోలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.

విజయ్ దేవరకొండ ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో నోటా సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో నాని సినిమా తెరకెక్కగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.మహేష్ బాబు మురగదాస్ కాంబినేషన్ లో స్పైడర్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కుడా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

రామ్ హీరోగా తెరకెక్కిన గణేష్ సినిమాకు శరవణన్ దర్శకత్వం వహించగా ది వారియర్ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించలేదు./br>

రవితేజ హీరోగా తెరకెక్కిన శంభో శివ శంభో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా దరువు సినిమాకు శివ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలు కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.తమిళ డైరెక్టర్ల డైరెక్షన్ లో నాని సెగ, ఎటో వెళ్లిపోయింది మనసు, జెండాపై కపిరాజు( Janda Pai Kapiraju ) సినిమాలలో నటించగా ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే./br>

Advertisement

నాగచైతన్య గౌతమ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ఏ మాయ చేశావె సక్సెస్ సాధించగా ఇదే కాంబోలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో( Sahasam Swasaga Sagipo ) డిజాస్టర్ అయింది.చైతన్య వెంకట్ ప్రభు కాంబోలో కస్టడీ మూవీ( Custody ) తెరకెక్కగా ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు.పవన్ ఎస్.జె.సూర్య కాంబోలో ఖుషి, పులి తెరకెక్కగా ఖుషి సక్సెస్ సాధిస్తే పులి మూవీ ఫ్లాప్ అయింది.పవన్ హీరోగా తెరకెక్కిన పంజా( Panjaa ), బంగారం కూడా కోలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు