ముఖానికి పొర‌పాటున కూడా ఇవి రాయ‌కూడ‌ద‌ట‌.. తెలుసా?

శ‌రీరం కంటే ముఖ చ‌ర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది.అందుకే దానిని చాలా జాగ్ర‌త్త‌గా కాపాడు కోవాలి.

అయితే కొంద‌రు తెలిసో, తెలియ‌కో ముఖానికి ఏది ప‌డితే అది రాసేస్తుంటారు.ఫ‌లితంగా ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య త‌లెత్తి నానా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది.

వాస్త‌వానికి ముఖ చ‌ర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలి అంటే కొన్నింటిని పూర్తిగా ఎవైడ్ చేయాలి.అవేంటో ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా వాళ్లు, వీళ్లు చెప్పిన మాట‌లు విని కొంద‌రు టూత్ పేస్ట్‌తో ముఖానికి ప్యాకులు వేసుకుంటారు.ముఖ్యంగా ముఖంపై మొటిమ‌ల‌ను త‌గ్గించుకునేందుకు టూత్ పేస్ట్‌ను విరి విరిగా వినియోగిస్తారు.

Advertisement
These Ingredients Should Not Be Apply On The Face! Face Care, Skin Care, Skin Ca

కానీ టూత్ పేస్ట్‌లో ఉండే ప‌లు గాఢమైన పదార్థాలు కొద్ది రోజుల‌కు ముఖంపై న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డేలా చేస్తాయి.కాబ‌ట్టి, పొర పాటున కూడా ఫేస్‌కి టూత్ పేస్ట్‌ను వాడొద్దు.

అలాగే ఇంట్లో త‌యారు చేసుకునే ఫేస్ ప్యాకుల్లో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను చాలా మంది యూజ్ చేస్తారు.అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వ‌ల్ల ముఖం హైపర్‌ పిగ్మెంటేషన్‌కి గురై అందవిహీనంగా మారే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

సో.ఇక‌పై ఆపిల్ సైడర్ వెనిగర్ ముఖానికి మాత్రం అప్లై చేయ‌వ‌ద్దు.

These Ingredients Should Not Be Apply On The Face Face Care, Skin Care, Skin Ca

ప్ర‌స్తుత ఈ చ‌లి కాలంలో కొంద‌రు ముఖం డ్రైగా మార‌కుండా ఉండేందుకు బాడీ లోషన్‌ను రాస్తారు.కానీ, ఫేస్‌కు బాడీ లోష‌న్‌ను ఎప్పుడూ రాయ‌రాదు.బాడి లోష‌న్ వ‌ల్ల ముఖ చ‌ర్మంపై అధిక జిడ్డు ఉత్ప‌త్తి అయ్యి మొటిమ‌ల‌కు దారి తీస్తుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇక ఇవే కాకుండా ముఖానికి నిమ్మ ర‌సం, క‌ఠిన‌మైన స‌బ్బులు, షుగ‌ర్ క్రిస్ట‌ల్స్‌, బేకింగ్‌ సోడా వంటి వాటిని సైతం ఉప‌యోగించ‌కూడ‌దు.ఎందుకుంటే ఈ ప‌దార్థాల వ‌ల్ల ముఖ చ‌ర్మం సున్నిత‌త్వాన్ని కోల్పోయి డ్రైగా, ర‌ఫ్‌గా మారి పోతుంది.

Advertisement

తాజా వార్తలు