ఈ అలవాట్లు ఉంటే మొటిమ‌లు పోనే పోవు.. జాగ్ర‌త్త‌!

టీనేజ్ ప్రారంభం అవ్వ‌గానే యువ‌తీ, యువ‌కుల‌ను ప్ర‌ధానంగా వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో మొటిమ‌ల‌దే మొద‌టి స్థానం.అందంగా, కాంతివంతంగా ఉండే ముఖాన్ని మొటిమ‌లు అంద‌హీనంగా మార్చేస్తాయి.

అందుకే మొటిమ‌లంటేనే భ‌య‌ప‌డుతుంటారు.ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ మొటిమ‌ల‌ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

అయితే యుక్త వ‌య‌సు నుంచి స్టార్ట్ అయ్యే ఈ మొటిమ‌లు.కొన్నేళ్ల త‌ర్వాత రావ‌డం త‌గ్గిపోతాయి.

కానీ, కొంద‌రిని మాత్రం ఎన్నేళ్లు గ‌డిచినా ఈ మొటిమ‌ల స‌మ‌స్య ప‌ట్టి పీడిస్తూనే ఉంటుంది.ఎన్ని క్రీములు రాసినా.

Advertisement

ఎన్ని మందులు వాడినా ఫ‌లితం ఉండ‌దు.అయితే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గ‌క‌పోవ‌డానికి కొన్ని కొన్ని అల‌వాట్లు కూడా కార‌ణాలు అవుతాయి.

ముఖ్యంగా కొంద‌రు ర‌క‌ర‌కాల ఫేస్ క్రీములు వాడ‌తారు.కానీ, మాయిశ్చరైజ‌ర్‌ను ఎవాయిడ్ చేస్తారు.

జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌లిగిన వారు కూడా మాయిశ్చరైజ‌ర్‌ను దూరం పెడ‌తారు.కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.

మాయిశ్చరైజ‌ర్‌ను వాడ‌టం వ‌ల్ల చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ ఉంటుంది.దాంతో మొటిమ‌లు స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అలాగే మృత‌క‌ణాల‌ను, మురికిని తొలిగించుకుని కాంతివంతంగా క‌నిపించేంద‌కు త‌ర‌చూ స్క్రబ్బింగ్ చేస్తుంది.స్క్రబ్బింగ్ చ‌ర్మానికి మంచిదే.కానీ, అతిగా చేస్తే.

Advertisement

మొటిమ‌ల స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది.ఇక కొంద‌రు ఫ్రెష్‌గా క‌నిపించేందుకు ముఖాన్ని క‌డిగిన వారు క‌డిగిన‌ట్టే ఉంటారు.

ఇలా త‌ర‌చూ ఫేస్ వాష్ చేస్తే.చర్మంపై ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ తొలగిపోతాయి.

దాంతో చర్మం మరింత ఎక్కువగా ఆయిల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఫ‌లితంగా మొటిమ‌లు వ‌స్తూనే ఉంటాయి.

అంతేకాదు, అతిగా ఫోన్ల మాట్లాడ‌టం, శుభ్రంగా లేని పిల్లోల‌‌పై నిద్రించ‌డం, మేకప్ ని తొలగించకుండా నిద్రించడం, మొటిమలను గిల్లడం, ఒత్తిడి, అతిగా మ‌ద్యం సేవించ‌డం, స‌రైన ఆహారాన్ని స‌రైనా టైమ్‌కి తీసుకోక‌పోవ‌డం ఇలాంటి అల‌వాట్ల కార‌ణంగా కూడా మొటిమ‌ల స‌మ‌స్య వ‌ద‌ల‌కుండా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.కాబ‌ట్టి, ఇలాంటి విష‌యాలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది.

తాజా వార్తలు